Nidhan
Duleep Trophy 2024, Ravindra Jadeja, Mohammed Siraj: డొమెస్టిక్ క్రికెట్లో కీలక టోర్నమెంట్ అయిన దులీప్ ట్రోఫీకి టైమ్ దగ్గర పడుతోంది. త్వరలోనే ఈ టోర్నీ షురూ కానుంది. ఈ తరుణంలో ఓ బ్యాడ్ న్యూస్. ఇద్దరు టీమిండియా స్టార్లు ఈ టోర్నీకి దూరమయ్యారు.
Duleep Trophy 2024, Ravindra Jadeja, Mohammed Siraj: డొమెస్టిక్ క్రికెట్లో కీలక టోర్నమెంట్ అయిన దులీప్ ట్రోఫీకి టైమ్ దగ్గర పడుతోంది. త్వరలోనే ఈ టోర్నీ షురూ కానుంది. ఈ తరుణంలో ఓ బ్యాడ్ న్యూస్. ఇద్దరు టీమిండియా స్టార్లు ఈ టోర్నీకి దూరమయ్యారు.
Nidhan
ఈ మధ్య భారత క్రికెట్లో ఎక్కువగా మాట్లాడుకుంటోంది దులీప్ ట్రోఫీ-2024 గురించే. నేషనల్ డ్యూటీ లేని టైమ్‌లో ప్లేయర్లంతా డొమెస్టిక్ క్రికెట్లో ఆడాల్సిందేనంటూ బీసీసీఐ కొత్త రూల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీమిండియాకు మ్యాచ్‌లు లేకపోవడంతో త్వరలో జరిగే దులీప్ ట్రోఫీలో భారత స్టార్లు అందర్నీ దింపుతోంది బోర్డు. ఈ టోర్నమెంట్లో పెర్ఫార్మెన్స్ చేసేతీరు, ఫామ్, ఫిట్నెస్ ఆధారంగా వచ్చే నెలలో జరిగే బంగ్లాదేశ్ సిరీస్‌కు జట్టును సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా టీమిండియా స్టార్లంతా దులీప్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో అభిమానులకు షాకింగ్ న్యూస్. దులీప్ ట్రోఫీకి ఇద్దరు టీమిండియా స్టార్లు దూరమయ్యారు. జట్టులోకి సెలెక్ట్ అయినా వాళ్లు ఈ టోర్నీలో ఆడటం లేదు. ఆ ప్లేయర్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ దులీప్ ట్రోఫీకి దూరమయ్యారు. వీళ్లిద్దరితో పాటు యంగ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కూడా ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఆడటం లేదు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు ధృవీకరించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. సిరాజ్ స్థానంలో నవదీప్ సైనీ, ఉమ్రాన్ ప్లేస్‌లో గౌరవ్ యాదవ్‌ను తీసుకుంటున్నట్లు తెలిపింది. టీమ్-బీ నుంచి జడేజాను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. సిరాజ్, ఉమ్రాన్లు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొంది. టోర్నమెంట్ మొదలయ్యే నాటికి వీళ్లు అందుబాటులో ఉండే అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. దులీప్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొత్తానికి ఈ పేసర్లు దూరం కానున్నట్లు తెలిపింది.
సిరాజ్-ఉమ్రాన్ మాలిక్ అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పిన బీసీసీఐ.. జడేజాను ఎందుకు రిలీజ్ చేస్తున్నారో మాత్రం చెప్పలేదు. దీంతో అతడు ఏ కారణాల వల్ల టోర్నీకి దూరమయ్యాడో అర్థం కావడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న సిరాజ్.. బంగ్లాతో సిరీస్ వరకు కోలుకుంటాడా? అనేది క్లారిటీ లేదు. ఒకవేళ సిరాజ్ రికవరీకి టైమ్ పడితే అతడ్ని ఇంకో ప్లేయర్‌తో రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నాలుగైదు నెలలు టీమిండియా షెడ్యూల్ టైట్‌గా ఉంది కాబట్టి సిరాజ్‌కు మరింత రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అతడు ఫుల్ ఫిట్నెస్ సాధించాకే టీమ్‌లోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక, దులీప్ ట్రోఫీ విషయానికొస్తే.. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5వ తేదీన మొదలుకానుంది. మొత్తం నాలుగు టీమ్స్ టోర్నీలో తలపడతాయి. ఇందులోని ఇండియా-ఏ టీమ్‌కు శుబ్‌మన్ గిల్, ఇండియా-బీ టీమ్‌కు అభిమన్యు ఈశ్వరన్, ఇండియా-సీ టీమ్‌కు రుతురాజ్ గైక్వాడ్, ఇండియా-డీకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
DULEEP TROPHY UPDATES:
– Saini replaces Siraj (Illness)
– Gaurav Yadav replaces Umran (Illness)
– Jadeja has been released from Team B. pic.twitter.com/qaK0249nlS— Johns. (@CricCrazyJohns) August 27, 2024