iDreamPost
android-app
ios-app

వీడియో: రిషభ్‌ పంత్‌తో లిట్టన్ దాస్ గొడవ! ఏం జరిగిందంటే..?

  • Published Sep 19, 2024 | 12:14 PM Updated Updated Sep 19, 2024 | 12:14 PM

IND vs BAN, Rishabh Pant, Litton Das: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌తో బంగ్లా వికెట్‌ కీపర్‌ లిట్టన్‌ దాస్‌ గొడవకు దిగాడు. మరి ఆ గొడవకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

IND vs BAN, Rishabh Pant, Litton Das: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌తో బంగ్లా వికెట్‌ కీపర్‌ లిట్టన్‌ దాస్‌ గొడవకు దిగాడు. మరి ఆ గొడవకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Sep 19, 2024 | 12:14 PMUpdated Sep 19, 2024 | 12:14 PM
వీడియో: రిషభ్‌ పంత్‌తో లిట్టన్ దాస్ గొడవ! ఏం జరిగిందంటే..?

బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన తొలి టెస్ట్‌లో టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ వెంటవెంటనే అవుట్‌ అయ్యారు. కేవలం 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, రిషభ్‌ పంత్‌ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 34 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా.. లంచ్‌ బ్రేక్‌ సమయానికి అదే 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అయితే.. ఆరంభంలోనే మూడు వికెట్ల తీసినా.. టీమిండియా నిలబడుతోందనే భయంతో బంగ్లా వికెట్‌ కీపర్‌ లిట్టన్‌ దాస్‌.. రిషభ్‌ పంత్‌ కాన్సన్‌ట్రేషన్‌ను దెబ్బతీయాలనే దుర్బుద్ధితో గొడవకు దిగాడు.

బంగ్లా బౌలర్‌ టస్కిన్‌ అహ్మద్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో ఈ గొడవ జరిగింది. ఫీల్డర్‌ త్రో విసిరిన బాల్‌ పంత్‌ ప్యాడ్‌కు తగిలి.. మిడ్‌ వికెట్‌ వైపు వెళ్లింది. దాంతో పంత్‌ ఎక్స్‌ట్రా రన్‌ కోసం ప్రయత్నించాడు. కానీ, జైస్వాల్‌ నో చెప్పడంతో క్రీజ్‌లోకి తిరిగి వచ్చాడు. అయితే.. బంగ్లా కీపర్‌ లిట్టన్‌ దాస్‌.. దానికి రన్‌ ఎలా తీస్తావ్‌ అంటూ పంత్‌కు ఏదో నీతులు చెప్పబోయాడు. ‘మరి బాల్‌ వికెట్లకు వేయండి.. నన్నేందుకు కొడుతున్నారు’ అంటూ పంత్‌ కౌంటర్‌ ఇవ్వడంతో వెనక్కి తగ్గాడు. కొద్ది సేపు ఇద్దరి మధ్య మాటలు చోటు చేసుకున్నాయి.

ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో పంత్‌ జాగ్రత్తగా ఆడాడు. కానీ, ఎప్పుడైతే లిట్టన్‌ దాస్‌ తనను గెలికాడో.. అప్పటి నుంచి గేర్‌ మార్చి అదిరిపోయే షాట్లు ఆడాడు. దాస్‌తో గొడవ సమయంలో 17 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసిన పంత్‌.. ఆ గొడవ తర్వాత.. సూపర్‌ షాట్లతో లంచ్‌ సమయానికి 5 ఫోర్లతో 44 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. లంచ్‌ తర్వాత కూడా పంత్‌ ఇదే ఇంటెంట్‌ను కొనసాగిస్తే.. ఎందుకురా బాబు పంత్‌ను గెలికింది అని లిట్టన్‌ దాస్‌ బాధ పడే ఇన్నింగ్స్‌ను పంత్‌ ఆడతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో పంత్‌ స్టామినా ఏంటో అందరికి తెలిసిందే. పంత్‌ క్రీజ్‌లో పాతుకోకముందే.. అతన్ని రెచ్చగొట్టి అవుట్‌ చేద్దాం అనుకున్నాడు లిట్టన్‌ దాస్‌.. కానీ, పంత్‌ను ఎంత కెలికితే.. అంత తిరగబడతాడనే విషయం అతనికి తెలిసి ఉండదు. మరి దాస్‌ వర్సెస్‌ పంత్‌ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.