SNP
Ravichandran Ashwin, Hardik Pandya: ఐపీఎల్ 2024లో దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్న క్రికెటర్ హార్ధిక్ పాండ్యా. అయితే పాండ్యా విషయంలో రవిచంద్రన్ అశ్విన్ తనదైన స్టైల్‌లో స్పందించాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
Ravichandran Ashwin, Hardik Pandya: ఐపీఎల్ 2024లో దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్న క్రికెటర్ హార్ధిక్ పాండ్యా. అయితే పాండ్యా విషయంలో రవిచంద్రన్ అశ్విన్ తనదైన స్టైల్‌లో స్పందించాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 ఆరంభానికంటే ముందు నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఐపీఎల్ 2022, 2023 సీజన్స్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న పాండ్యా.. ఐపీఎల్ 2024 సీజన్‌కి ముందు గుజరాత్‌ను వీడి.. ముంబై ఇండియన్స్‌లోకి తిరిగి వచ్చాడు. అతను వచ్చిన తర్వాత.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి.. అతని స్థానంలో హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించారు. ఇక్కడి నుంచి హార్ధిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరిగింది. అతను డబ్బు కోసమే ముంబై ఇండియన్స్‌ను వీడాడని, మళ్లీ తిరిగి డబ్బు కోసమే ముంబైలోకి వచ్చాడని, అలాంటి వాడికి రోహిత్‌ను కాదని కెప్టెన్సీ ఎలా ఇస్తారంటూ క్రికెట్ అభిమానులు మండిపడ్డారు.
ఈ కోపం అక్కడితో చల్లారలేదు. ఐపీఎల్ ప్రారంభం అయిన తర్వాత ఆ ట్రోలింగ్ కాస్త నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించిన తర్వాత కూడా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది ముంబై. ఈ మ్యాచ్ కంటే ముందు పాండ్యా టాస్‌కి వచ్చిన సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులు పాండ్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే మ్యాచ్ మధ్యలో కుక్క వచ్చిన సమయంలో ‘హార్దిక్.. హార్దిక్..’ అంటూ గోల చేసి.. పాండ్యాను దారుణంగా అవమానించారు. అతను బ్యాటింగ్‌కి వచ్చిన టైమ్‌లో కూడా ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వినిపించింది.
ఇదే విషయంపై తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. పాండ్యాకు మద్దతుగా నిలిచాడు. ఫ్యాన్స్ ఇలా ప్రవర్తించడం సరికాదని, ఒక ఆటగాడు ఏ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడో గుర్తుంచుకోవాలని అన్నాడు. మన దేశపు ఆటగాడి పట్ల ఇలాంటి వైఖరి సరికాదని హితవు పలికాడు. మీకు నచ్చిన ఆటగాడిని నెత్తిన పెట్టుకోండి కానీ, వేరే ఆటగాడిని కించపర్చకండి అంటూ హెచ్చరించాడు. మన దేశంలో ఇదొక్కటే తనకు నచ్చదంటూ.. రోహిత్ అభిమానులు పాండ్యాను ట్రోల్ చేయడంపై స్పందించాడు అశ్విన్. అలాగే బాలీవుడ్ నటుడు సోనుసూద్ సైతం పాండ్యాకు మద్దతుగా నిలిస్తూ.. మన దేశానికి ఆటగాడిని గౌరవించాలని, ఐపీఎల్‌లో అతను ఏ ఫ్రాంచైజీకి ఆడుతున్నాడన్నది అనవసరం అంటూ పేర్కొన్నాడు. మరి పాండ్యాకు అవ్విన్, సోనుసూద్ మద్దుతగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
R Ashwin calls for Rohit Sharma fans to stop booing Hardik Pandya
📷:BCCI#ravichandranashwin #Hardikpandya #rohitsharma #IPL2024 pic.twitter.com/OC8oThbc24
— SportsTiger (@The_SportsTiger) March 30, 2024