iDreamPost

అతడో గొప్ప ఫైటర్.. కానీ మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం! దిగ్గజ ప్లేయర్ పై అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

అతడో గొప్ప పోరాట యోధుడని, కానీ మనమే తప్పుగా అర్థం చేసుకున్నామని.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు రవిచంద్రన్ అశ్విన్. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

అతడో గొప్ప పోరాట యోధుడని, కానీ మనమే తప్పుగా అర్థం చేసుకున్నామని.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు రవిచంద్రన్ అశ్విన్. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

అతడో గొప్ప ఫైటర్.. కానీ మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం! దిగ్గజ ప్లేయర్ పై అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ప్రపంచ క్రికెట్ లో అతడో పోరాట యోధుడు అని, కానీ స్టార్ ప్లేయర్ ను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఓ టీమిండియా మాజీ బ్యాటర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి రోజుల్లో అతడితో ఆడిన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నాడు అశ్విన్. మరి ఆ గొప్ప ఫైటర్ ఎవరు? అతడిని చాలా మంది ఎందుకు తప్పుగా అర్ధం చేసుకున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. భారత మాజీ క్రికెటర్, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ పేరు దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే అతడు హెడ్ కోచ్ పదవి ఇంటర్వ్యూకి కూడా హాజరైయ్యాడు. ఇక గంభీర్ పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించడమే తరువాయి. ఈ నేపథ్యంలో గౌతీపై పొగడ్తల వర్షం కురిపించాడు రవిచంద్రన్ అశ్విన్. ఈ సందర్భంగా గంభీర్ తో కలిసి ఆడిన రోజులను గుర్తు చేసుకున్నాడు.

“2011 వరల్డ్ కప్ కు ముందు నేను రెండేళ్ల పాటు జట్టుకు డ్రింక్స్ మాత్రమే అందించాను. ఇక నన్ను 2012లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు పూర్తిస్థాయిలో ఎంపిక చేశారు. టీమ్ లోకి వచ్చిన తొలిరోజుల్లో నాలో ఆత్మవిశ్వాసం పెరగడానికి గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఇంతకు ముందు తమిళనాడు నుంచి వచ్చిన వారెవరు కూడా నాలో ఇంత విశ్వాసం కలిగించలేదు. అయితే గంభీర్ ప్రవర్తనను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆటపై అతడికున్న విజన్ అత్యుత్తమమైనది. గంభీర్ ఒక గొప్ప ఫైటర్. మనకున్న వీక్ నెస్ ఏంటంటే? ఒక్కసారి ఓ ప్లేయర్ ను హీరోగా చూశామంటే చాలు.. మిగతా వాళ్లను పట్టించుకోము. సినిమాల్లో లాగా క్రికెట్ లో హీరోలు, విలన్లు ఉండరు. గంభీర్ విజయం కోసం కఠోరంగా శ్రమిస్తాడు. అతడిపై నాకు అపారమైన గౌరవం ఉంది” అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. హెడ్ కోచ్ అవుతాడన్న వార్తల నేపథ్యంలో అశ్విన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా ఆశ్చర్యమే అంటున్నారు క్రీడా పండితులు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి