Somesekhar
#DoItForDravid అనే క్యాంపెయిన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్యాంపెయిన్ పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఏమన్నాడంటే?
#DoItForDravid అనే క్యాంపెయిన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్యాంపెయిన్ పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఏమన్నాడంటే?
Somesekhar
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసం టీ20 వరల్డ్ కప్ గెలవాలని సెహ్వాగ్ తో పాటుగా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #DoItForDravid అనే క్యాంపెయిన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్యాంపెయిన్ పై రాహుల్ ద్రవిడ్ సైతం తనదైన శైలిలో స్పందించాడు. వరల్డ్ కప్ నాకోసం గెలవాలి అనడం కరెక్ట్ కాదని తన నిజాయితీని చాటుకున్నాడు. ఇక ఈ క్యాంపెయిన్ పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఒక వ్యక్తి కోసం వరల్డ్ కప్ గెలవాలి అనడం ఏంటి? అంటూ ప్రశ్నించాడు.
#DoItForDravid ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. టైటిల్ ను ద్రవిడ్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని క్యాంపెయిన్ జరుగుతోంది. ఇక ఇలాంటి వాటి గురించి నేను అస్సలు పట్టించుకోనని ద్రవిడ్ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంలో ద్రవిడ్ పై ప్రశంసలు కురిపించాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ‘డూ ఇట్ ఫర్ ద్రవిడ్’ క్యాంపెయిన్ పై అశ్విన్ ఈ విధంగా మాట్లాడాడు.
“కేవలం ఒక్కరి కోసం వరల్డ్ కప్ గెలవడం ఏంటి? ఇలాంటి కథనాలను సృష్టించకూడదు. ఇలాంటి వార్తలు క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయడమే కాకుండా.. జట్టులో వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక ద్రవిడ్ క్లాసిక్ పర్సన్. ఇలాంటి వాటిని కొట్టిపారేస్తాడని నాకు తెలుసు. ఇలాంటి ట్రెండ్ వల్ల టీమిండియా క్రికెట్ వాతావరణం చెడిపోతుంది. అది విజయావకాశాలను దెబ్బతీస్తుంది. ఇక మరోసారి ఇండియాకు వరల్డ్ కప్ గెలిచే అవకాశం వచ్చింది.. గట్టిగా పోరాడండి” అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అశ్విన్ కామెంట్స్ వైరల్ గా మారాయి.