తన వరల్డ్ కప్ అనుభవాలకు సంబంధించి పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. ఆసీస్ ఫస్ట్ బౌలింగ్ చేయడానికి కారణం అదే అంటూ.. ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ చెప్పిన సీక్రెట్ ను రివీల్ చేశాడు.
తన వరల్డ్ కప్ అనుభవాలకు సంబంధించి పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. ఆసీస్ ఫస్ట్ బౌలింగ్ చేయడానికి కారణం అదే అంటూ.. ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ చెప్పిన సీక్రెట్ ను రివీల్ చేశాడు.
ప్రపంచ కప్ 2023 భారతీయులకు ఓ పీడకలనే మిగిల్చింది. వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా.. అందుకు తగ్గట్లుగానే అద్భుతమైన విజయాలతో టోర్నీలో అదరగొట్టింది. వరుసగా పది మ్యాచ్ ల్లో విజయాలు సాధించి.. సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. కానీ తుది పోరులో కంగారూ చేతిలో కంగుతిని టైటిల్ ను చేజార్చుకుంది. ఇక వరల్డ్ కప్ ముగిసి రోజులు గడుస్తున్నా.. ఫైనల్ మ్యాచ్ పై విశ్లేషకులు, క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించి, తన వరల్డ్ కప్ అనుభవాలకు సంబంధించి పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. ఆసీస్ ఫస్ట్ బౌలింగ్ చేయడానికి కారణం అదే అంటూ.. ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ చెప్పిన సీక్రెట్ ను రివీల్ చేశాడు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత పలు షాకింగ్ విషయాలను వెల్లడించాడు రవిచంద్రన్ అశ్విన్. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అమలు పరిచిన వ్యూహాలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని, ఇక తనను ఒకే మ్యాచ్ ఆడించి పక్కకు పెట్టేస్తారని అస్సలు ఊహించలేదని యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకొచ్చాడు. మరిన్ని విషయాల గురించి అశ్విన్ మాట్లాడుతూ..”ఈ వరల్డ్ కప్ లో తన ప్రయాణం ఒకే మ్యాచ్ కు పరిమితం అవుతుందని అస్సలు ఊహించలేదు. అయితే జట్టు అవసరాల మేరకు తనకు స్థానం దక్కలేదు. అయితే ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ అమలు చేసిన ప్లాన్స్ నన్ను దిగ్బ్రాంతికి గురిచేశాయి. మరీ ముఖ్యంగా పాట్ కమ్మిన్స్ జట్టును అద్భుతంగా ముందుకు నడిపాడు. బౌలింగ్ లో సూపర్ స్పెల్ వేయడమే కాకుండా, ఫీల్డింగ్ సెటప్ ను మోహరించిన తీరు అమోఘం” అంటూ చెప్పుకొచ్చాడు అశ్విన్.
ఇదంతా ఒకెత్తు అయితే.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అశ్విన్ ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీతో జరిగిన సంభాషనను ఇక్కడ ప్రస్తావించాడు. మీరు ఎప్పుడూ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారుగా.. ఈసారి బౌలింగ్ ఎందుకు ఎంచుకున్నారు అని అశ్విన్ అడిగాడట. అందుకు జార్జ్ బెయిలీ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.”మేం ఇక్కడ ఎన్నో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాం. అదీకాక ఐపీఎల్ మ్యాచ్ లు కూడా ఆడిన అనుభవం మాకుంది. ఇక పిచ్ ల విషయానికి వస్తే.. ఎర్రమట్టి పిచ్ లు పగుళ్లు వస్తాయి. కానీ నల్ల మట్టి అలా కాదు. రాత్రి వేళ ఈ పిచ్ లు మరింత మంచిగా తయ్యారు అవుతాయి. ఈ పిచ్ లపై మధ్యాహ్నం బంతి స్పిన్ తిరుగుతుంది. కానీ రాత్రి అయ్యేసరికి గట్టిగా మారుంది. ఇదే మా అనుభవం” అని జార్జ్ బెయిలీ చెప్పుకొచ్చాడు. మరి అశ్విన్ చెప్పుకొచ్చిన ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.