iDreamPost
android-app
ios-app

CSKలోకి టీమిండియా స్టార్‌ క్రికెటర్‌! ధోని తర్వాత అంతా అతని చేతుల్లోకే!

  • Published Jun 05, 2024 | 11:11 AM Updated Updated Jun 05, 2024 | 11:28 AM

సీఎస్​కేలోకి ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ మెగా ఆక్షన్​తో సంబంధం లేకుండానే చెన్నై జట్టులోకి వచ్చేశాడు. ధోని తర్వాత అంతా అతడి చేతుల్లోకే వెళ్లనుందని తెలుస్తోంది.

సీఎస్​కేలోకి ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ మెగా ఆక్షన్​తో సంబంధం లేకుండానే చెన్నై జట్టులోకి వచ్చేశాడు. ధోని తర్వాత అంతా అతడి చేతుల్లోకే వెళ్లనుందని తెలుస్తోంది.

  • Published Jun 05, 2024 | 11:11 AMUpdated Jun 05, 2024 | 11:28 AM
CSKలోకి టీమిండియా స్టార్‌ క్రికెటర్‌! ధోని తర్వాత అంతా అతని చేతుల్లోకే!

ఐపీఎల్ పాపులర్ ఫ్రాంచైజీల్లో ఒకటైన సీఎస్​కేలోకి ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంట్రీ ఇచ్చాడు. మెగా ఆక్షన్​తో సంబంధం లేకుండానే చెన్నై జట్టులోకి వచ్చేశాడు. లెజెండ్ ఎంఎస్ ధోని తర్వాత అంతా అతడి చేతుల్లోకే వెళ్లనుందని తెలుస్తోంది. ఆ స్టార్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..   భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​ గురించి తెలిసిందే. క్వాలిటీ ఆఫ్ స్పిన్​, క్యారమ్ డెలివరీస్​తో బ్యాటర్ల పని పడుతుంటాడు. ఎంఎస్ ధోనీలాగే అతడిది కూడా మంచి క్రికెటింగ్ బుర్ర. మ్యాచ్ సిచ్యువేషన్స్, ప్రత్యర్థి బ్యాటర్ల ఆటతీరును బట్టి ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ వేస్తుంటాడు అశ్విన్. తన స్ట్రాటజీలు, తెలివితో వాళ్ల ఆటకట్టిస్తుంటాడు. అందుకే ఐపీఎల్​లో అతడికి మంచి క్రేజ్ ఏర్పడింది. రాజస్థాన్ రాయల్స్​ తరఫున బరిలోకి దిగిన ఈ మ్యాజికల్ స్పిన్నర్.. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్​లో అదరగొట్టాడు. టోర్నీ ఫస్టాఫ్​లో కాస్త ఇబ్బందిపడినా తర్వాత కోలుకొని సత్తా చాటాడు. రాజస్థాన్ ప్లేఆఫ్స్​కు చేరుకోవడంలో తన వంతు కృషి చేశాడు. అయితే అశ్విన్​కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఐపీఎల్​లో రాజస్థాన్ రాయల్స్​కు ఆడుతున్న అశ్విన్.. ఇప్పుడు పాత గూటికి చేరుకున్నాడు. చెన్నై సూపర్​కింగ్స్​లోకి అతడు రీఎంట్రీ ఇచ్చాడు. మెగా ఆక్షన్​తో సంబంధం లేకుండానే సీఎస్​కేలోకి వచ్చేశాడు అశ్విన్. అయితే ప్లేయర్​గా మాత్రం కాదు. ఇండియా సిమెంట్స్​ గ్రూప్​లో రీజాయిన్ అయ్యాడు. దీంతో ఈ కంపెనీకి చెందిన సీఎస్​కే జట్టులోనూ అతడి పెత్తనం నడవనుంది. చెన్నై సూపర్​కింగ్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్​ బాధ్యతల్ని అశ్విన్​కు అప్పగించింది ఇండియా సిమెంట్స్. ఐపీఎల్-2025 సీజన్​కు ముందే ఈ సెంటర్ పనులు మొదలవుతాయి. ఈ కేంద్రంతో పాటు సూపర్ కింగ్ అకాడమీల్లోనూ అశ్విన్ మేజర్ రోల్ పోషించనున్నాడు. సీఎస్​కే పెర్ఫార్మెన్స్ సెంటర్, అకాడమీ బాధ్యతల్ని అప్పగించడం ద్వారా.. మెగా ఆక్షన్​లో అశ్విన్​ను చెన్నై జట్టులోకి తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.

సీఎస్​కే వెంచర్​లోకి అశ్విన్ తిరిగి రావడంపై ఆ టీమ్ సీఈవో కరి విశ్వనాథన్ హర్షం వ్యక్తం చేశారు. సీఎస్​కే సెంటర్, అకాడమీ బాధ్యతల్ని చూసుకోవడంతో పాటు ఇండియా సిమెంట్స్​కు చెందిన టీఎన్​సీఏ ఫస్ట్ డివిజన్స్ టీమ్స్ తరఫున అశ్విన్ బరిలోకి దిగుతాడని విశ్వనాథన్ తెలిపారు. చెన్నై ప్రధాన జట్టులోకి ఈ స్పిన్నర్ రాకపై కూడా ఆయన కామెంట్స్ చేశారు. మెగా ఆక్షన్​లో అశ్విన్​ను తీసుకునేందుకు ప్రయత్నిస్తామని, అయితే వేలంలో ఏం జరుగుతుందో చెప్పలేమంటూ ట్విస్ట్ ఇచ్చారు. అక్కడ ఎవర్నీ ఎవరూ కంట్రోల్ చేయలేరని తెలిపారు. అయితే అశ్విన్​ను సొంతం చేసుకునే ఛాన్స్ కోసం ఎదురు చూస్తామని, ఏ మాత్రం అవకాశం ఉన్నా అతడ్ని తీసేసుకుంటామన్నారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి ఈ సీనియర్ స్పిన్నర్ ఎల్లో జెర్సీ వేసుకోవడం పక్కాగా కనిపిస్తోంది. మరి.. సీఎస్​కే వెంచర్​లోకి అశ్విన్ రాకపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.