Nidhan
Ravichandran Ashwin Opens Up on Rahul Dravid: టీమిండియాను సక్సెస్‌ఫుల్‌గా నడిపిన కోచ్‌ల్లో రాహుల్ ద్రవిడ్ ఒకడు. టీ20 వరల్డ్ కప్‌ను భారత్ అందుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. జట్టును అద్భుతంగా నడిపించిన ద్రవిడ్.. మూడు ఫార్మాట్లలోనూ మెన్ ఇన్ బ్లూను టాప్‌లో నిలిపాడు.
Ravichandran Ashwin Opens Up on Rahul Dravid: టీమిండియాను సక్సెస్‌ఫుల్‌గా నడిపిన కోచ్‌ల్లో రాహుల్ ద్రవిడ్ ఒకడు. టీ20 వరల్డ్ కప్‌ను భారత్ అందుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. జట్టును అద్భుతంగా నడిపించిన ద్రవిడ్.. మూడు ఫార్మాట్లలోనూ మెన్ ఇన్ బ్లూను టాప్‌లో నిలిపాడు.
Nidhan
టీమిండియాను సక్సెస్‌ఫుల్‌గా నడిపిన కోచ్‌ల్లో రాహుల్ ద్రవిడ్ ఒకడు. టీ20 వరల్డ్ కప్-2024ను భారత్ అందుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. జట్టును అద్భుతంగా నడిపించిన ద్రవిడ్.. మూడు ఫార్మాట్లలోనూ మెన్ ఇన్ బ్లూను టాప్‌లో నిలిపాడు. వన్డే వరల్డ్ కప్-2023 మిస్ అయినా.. ఈ ఏడాది దేశానికి పొట్టి కప్పును అందించి తన కోచింగ్ కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌తో టీమిండియా హెడ్ కోచ్ పదవికి అతడు గుబ్‌బై చెప్పేశాడు. జట్టుతో ఉన్న టైమ్‌లో అందరు ఆటగాళ్లతో అతడు మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేశాడు. బ్యాటర్లు, బౌలర్లకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. వాళ్ల పెర్ఫార్మెన్స్లే దీనికి బిగ్ ఎగ్జాంపుల్. అయితే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ద్రవిడ్ తమను టార్చర్ చేశాడని అంటున్నాడు. అశ్విన్ అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..
ద్రవిడ్ ప్రతి విషయంలో పర్టిక్యులర్‌గా ఉండేవాడని అశ్విన్ తెలిపాడు. అన్నీ సరిగ్గా ఉండాలని అతడు కోరుకునేవాడని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ విషయాల్లోనూ అతడు కచ్చితత్వంతో ఉండేవాడన్నాడు. ఒక చోట పెట్టిన బాటిల్.. తిరిగి అక్కడే పెట్టాలని లేకపోతే ఊరుకునేవాడు కాదన్నాడు. ప్రతి విషయం ఆర్డర్లో ఉండాలి, తాను అనుకున్నవి అనుకున్నట్లు పద్ధతి ప్రకారం జరగాలని అనేవాడని.. ఆ రకంగా తమకు టార్చర్ చూపించాడని అన్నాడు అశ్విన్. అయితే కోచ్‌గా తమకు అండగా నిలబడ్డాడని, తమకు ఎంతో సపోర్ట్ చేశాడని మెచ్చుకున్నాడు. ద్రవిడ్‌తో పోలిస్తే ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ కంప్లీట్‌గా డిఫరెంట్ అన్నాడు. అతడికి ప్రతిదీ ఇలా ఉండాలి, అలా ఉండాలనే ఎక్స్పెక్టేషన్స్ లేవన్నాడు. అతడు చాలా రిలాక్స్డ్గా ఉంటాడని పేర్కొన్నాడు అశ్విన్.
గంభీర్ ఎప్పడూ కూల్‌గా, కామ్‌గా ఉంటాడని అశ్విన్ తెలిపాడు. అతడ్ని అందరూ ఇష్టపడతారన్నాడు. అతడి వ్యక్తిత్వం అలాంటిదన్నాడు. జట్టులోని ప్రతి ప్లేయర్ గంభీర్‌ను ఇష్టపడతారని చెప్పుకొచ్చాడు అశ్విన్. డ్రెస్సింగ్ రూమ్‌లో గౌతీ నవ్వుతూ రిలాక్స్డ్గా ఉంటాడని పేర్కొన్నాడు. అదే ద్రవిడ్ కాస్త సీరియస్‌గా ఉండేవాడని.. తాను అనుకున్నది అనుకున్నట్లు జరగాలని కోరుకునేవాడన్నాడు. గంభీర్ నుంచి అలాంటి ప్రెజర్ లేదన్నాడు అశ్విన్. అతడు కూల్‌గా తన పని తాను చేసుకుంటూ, అందరితో ఈజీగా కలసిపోతాడన్నాడు. ఇక, బంగ్లాదేశ్‌తో మొదటి టెస్ట్‌లో అదరగొట్టిన అశ్విన్ సెకండ్ ఛాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. స్పిన్‌కు అంతగా అనుకూలించని చెన్నైలోనే 6 వికెట్లతో చెలరేగిన ఈ సీనియర్ బౌలర్.. టర్న్ పుష్కలంగా దొరికే కాన్పూర్‌లో బంగ్లా బెండు తీయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో రెచ్చిపోతున్న అశ్విన్ అదే జోరును కనబరిస్తే మరిన్ని పాత రికార్డులకు పాతర వేయడం ఖాయం.