లక్నో వేదికగా అక్టోబర్ 29న ఇంగ్లాండ్ తో జరగనున్న మ్యాచ్ కోసం టీమిండియా ఓ మాస్టర్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్ బలహీనతపై దెబ్బకొట్టాలని టీమిండియా పక్కా ప్రణాళికతో మ్యాచ్ కోసం సిద్దమవుతోంది.
లక్నో వేదికగా అక్టోబర్ 29న ఇంగ్లాండ్ తో జరగనున్న మ్యాచ్ కోసం టీమిండియా ఓ మాస్టర్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్ బలహీనతపై దెబ్బకొట్టాలని టీమిండియా పక్కా ప్రణాళికతో మ్యాచ్ కోసం సిద్దమవుతోంది.
వరల్డ్ కప్ లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. సొంతగడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగి.. అందుకు తగ్గట్లుగానే రాణిస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక ఈ టోర్నీలో మరో విజయం కోసం భారత్ వేచిచూస్తోంది. తన నెక్ట్స్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో తలపడబోతోంది. లక్నో వేదికగా అక్టోబర్ 29న జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఓ మాస్టర్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్ బలహీనతపై దెబ్బకొట్టాలని టీమిండియా పక్కా ప్రణాళికతో మ్యాచ్ కోసం సిద్దమవుతోంది. ఇక ఇదే విషయాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చెప్పుకొచ్చాడు. మరి టీమిండియా మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వరల్డ్ కప్ 2023లో టీమిండియా మరో విజయం సాధించడానికి సిద్దమవుతోంది. లక్నో వేదికగా అక్టోబర్ 29న ఇంగ్లాండ్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మాస్టర్ ప్లాన్ తో బరిలోకి దిగాలని మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో హర్భజన్ మాట్లాడుతూ..”ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే? ఇంగ్లాండ్ బ్యాటర్లు అంత సమర్థవంతంగా స్పిన్ ఆడలేరు కాబట్టి. దీంతో కుల్దీప్, జడేజాలతో పాటుగా మరో స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.
ఇక ఇప్పటికే ఇంగ్లాండ్ ఈ టోర్నీలో బాగా వెనకబడిపోయింది. ఇండియాతో మ్యాచ్ లో బాల్ తిరగడం మెుదలైతే.. ఇంగ్లీష్ జట్టుకు మరిన్ని కష్టాలు తప్పవు. అందుకే భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలి. షమీ వచ్చీరాగానే 5 వికెట్లతో రాణించాడు కాబట్టి.. సిరాజ్ ను ఈ మ్యాచ్ కు పక్కనపెట్టే అవకాశం ఉంది. అతడు వరుసగా మ్యాచ్ లు ఆడుతున్నాడు కాబట్టి.. సిరాజ్ కు రెస్ట్ ఇస్తే బాగుంటుంది” అని హర్భజన్ పేర్కొన్నాడు. అయితే లక్నో పిచ్ లో బాల్ టర్న్ అయితే తప్ప టీమిండియా తుది జట్టులో మార్పు ఉండదని భజ్జీ చెప్పుకొచ్చాడు.
కాగా.. భజ్జీతో పాటుగా చాలా మంది అభిప్రాయం కూడా ఇదే. స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఆడటం ఇంగ్లాండ్ జట్టుకు రాదు. ఇదే అదునుగా భావించి.. టీమిండియా అనుభవం ఉన్న అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకోవడమే మంచిదని క్రికెట్ అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇటు టీమిండియా కూడా ఇదే మాస్టర్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. మరి సిరాజ్ స్థానంలో అశ్విన్ జట్టులోకి వస్తే ఎలా ఉంటుందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ashwin is likely to play against England at Lucknow. [PTI] pic.twitter.com/OwyMzF1fMv
— Johns. (@CricCrazyJohns) October 26, 2023