iDreamPost

ఆస్ట్రేలియా జట్టులో విభేదాలు.. మ్యాక్స్‌వెల్‌ కామెంట్‌కు వార్నర్‌ కౌంటర్‌!

  • Author singhj Published - 02:45 PM, Thu - 26 October 23

వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా టీమ్​లో విభేదాలు ఉన్నాయని టాక్. అందుకు తాజాగా మ్యాక్స్​వెల్​ కామెంట్​కు వార్నర్ కౌంటర్ ఇవ్వడమే ఎగ్జాంపుల్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా టీమ్​లో విభేదాలు ఉన్నాయని టాక్. అందుకు తాజాగా మ్యాక్స్​వెల్​ కామెంట్​కు వార్నర్ కౌంటర్ ఇవ్వడమే ఎగ్జాంపుల్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.

  • Author singhj Published - 02:45 PM, Thu - 26 October 23
ఆస్ట్రేలియా జట్టులో విభేదాలు.. మ్యాక్స్‌వెల్‌ కామెంట్‌కు వార్నర్‌ కౌంటర్‌!

వన్డే వరల్డ్ కప్​లో కరెక్ట్ టైమ్​లో ఫామ్​లోకి వచ్చింది ఆస్ట్రేలియా. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఆ టీమ్ సెమీఫైనల్​కు చేరడం కష్టమేనని అంతా అనుకున్నారు. ఛాంపియన్ టీమ్ పనైపోయిందని మాజీ క్రికెటర్లు విమర్శించారు. అయితే అనూహ్యంగా పుంజుకున్న కంగారూ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. నెదర్లాండ్స్​తో బుధవారం జరిగిన మ్యాచ్​లోనైతే ఏకంగా 309 రన్స్ తేడాతో నెగ్గింది. వరల్డ్ కప్ హిస్టరీలో ఇదే భారీ విక్టరీ కావడం విశేషం. ఆసీస్ గెలుపులో గ్లెన్ మ్యాక్స్​వెల్ (106), డేవిడ్ వార్నర్ (104) కీలక పాత్ర పోషించారు. వీళ్లిద్దరూ సెంచలరీలతో చెలరేగి టీమ్​కు భారీ స్కోరును అందించారు.

హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్​లో ఉన్న ఆస్ట్రేలియా టీమ్​లో విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అందుకు మ్యాక్స్​వెల్​-వార్నర్ డిఫరెంట్ ట్వీట్లు చేయడమే నిదర్శనమని అంటున్నారు. అసలు విషయంలోకి వస్తే.. ఢిల్లీ వేదికగా ఆసీస్​తో డచ్ టీమ్ నిన్న మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్​లో లైటింగ్ షో నిర్వహించారు. అయితే ఈ షోపై మ్యాక్స్​వెల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ తర్వాత అతడు మాట్లాడుతూ.. లైటింగ్ షో వల్ల ఒక్కసారిగా తలనొప్పి వచ్చేసిందన్నాడు. తానొక్కడినే కాదు క్రికెటర్లు అందరూ ఇలాంటి షోస్ వల్ల ఇబ్బందిపడిన సందర్భాలు ఉన్నాయని తెలిపాడు. ఆ లైటింగ్ ఆగాక కళ్లు అడ్జస్ట్ అయ్యేందుకు కాస్త టైమ్ పడుతుందన్నాడు. ఈ షో జరిగిన రెండు నిమిషాలు తాను కళ్లు మూసుకునేందుకు ప్రయత్నించానని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు.

లైటింగ్ షో అనేది ఫ్యాన్స్​కు అద్భుతమైన ఎక్స్​పీరియెన్స్​ను ఇస్తుందేమో గానీ.. క్రికెటర్లకు మాత్రం భయానక అనుభవమే అవుతుందన్నాడు మ్యాక్స్​వెల్. దీనిపై ట్విట్టర్​లో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. అయితే అతడి కామెంట్​కు కౌంటర్​గా వార్నర్ ఒక పోస్ట్ పెట్టాడు. లైట్ షోను తనకు బాగా నచ్చిందన్నాడు డేవిడ్ భాయ్. ఇది ఫ్యాన్స్ కోసమేనని.. అభిమానుల వల్లే తామిదంతా చేయగలుగుతున్నామని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ఆసీస్​ టీమ్​లో ఏదో జరుగుతోందని.. సీనియర్ క్రికెటర్ల మధ్య విభేదాలు ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆసీస్ టీమ్​లో విభేదాలు ఉన్నట్లు వస్తున్న న్యూస్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌ టోర్నీ విడిచి స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్‌ క్రికెటర్‌! అది కూడా ట్రైన్‌లో..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి