iDreamPost
android-app
ios-app

Ashwin: రెండో టెస్ట్‌లో అంపైర్‌తో గొడవకు దిగిన అశ్విన్‌! ఎందుకంటే..?

  • Published Feb 02, 2024 | 5:20 PM Updated Updated Feb 02, 2024 | 5:20 PM

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అంపైర్‌తో గొడవకు దిగాడు. మ్యాచ్‌ ముగింపు సమయంలో అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. గొడవకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అంపైర్‌తో గొడవకు దిగాడు. మ్యాచ్‌ ముగింపు సమయంలో అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. గొడవకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 02, 2024 | 5:20 PMUpdated Feb 02, 2024 | 5:20 PM
Ashwin: రెండో టెస్ట్‌లో అంపైర్‌తో గొడవకు దిగిన అశ్విన్‌! ఎందుకంటే..?

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా-ఇంగ్లండ్‌ జట్టు సమవుజ్జీలుగా తొలి రోజును ముగించాయి. భారత జట్టు 336 పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌ 6 వికెట్లు పడగొట్టింది. ఇలా తొలి రోజు ఇరు జట్లు బాగానే రాణించాయి. టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఒక్కడే ఇంగ్లండ్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. కానీ, మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. జైస్వాల్‌ ఒక్కటే 179 పరుగులతో నాటౌట్‌ నిలిచాడు. అతను కూడా నిలబడకపోయి ఉంటే.. టీమిండియా తొలి రోజే చాపచుట్టేసేది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, అంపైర్‌తో గొడవకు దిగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈ సంఘటన చోటు చేసుకుంది. అశ్విన్‌ ఎందుకు అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడో ఇప్పుడు తెలుసుకుందాం..

టెస్టు మ్యాచ్‌లో డేలో చివరి సెషన్‌లో ఏ టీమ్‌ అయినా ఎక్కువగా వికెట్లు కోల్పోతూ ఉంటుంది. అందుకే మరికొద్ది సేపట్లో డే ముగుస్తుందన్న సమయంలో వికెట్లు పడితే.. టెయిలెండర్లను నైట్‌వాచ్‌గా పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే.. అతను పరుగులు కొట్టకపోయినా పర్లేదు, అలాగే అతను అవుటైన పెద్దగా నష్టం లేదని పంపిస్తారు. అలాగే డే చివర్లో లైటింగ్‌ సరిగా లేకపోయినా.. మ్యాచ్‌ నిలిపేస్తుంటారు అంపైర్లు. కానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం అంపైర్‌ లైటింగ్‌ సరిగా లేకపోయినా ఆటను కొనసాగించారు. అప్పటికీ అశ్విన్‌ ఒకసారి అంపైర్‌కు చెప్పాడు. వెలుతురు సరిగా లేదు ఆపేయండి అని. అయినా కూడా వినకుండా అంపైర్‌ మ్యాచ్‌ను కొనసాగించాడు.

పోనీ.. టెస్ట్‌ మ్యాచ్‌లో ఒక రోజులో పడాల్సిన ఓవర్ల కంటే కూడా ఓ మూడు ఓవర్లు ఎక్కువే పడ్డాయి. సాధారణంగా ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక రోజులో 90 ఓవర్లు వేయిస్తూ ఉంటారు. లైటింగ్‌ సరిగా లేకుంటే అంతకంటే తక్కువ ఓవర్లే పడతాయి. కానీ, ఈ మ్యాచ్‌లో అంపైర్లు 93 ఓవర్లు వేయించారు. 92 ఓవర్లు ముగిసిన తర్వాత.. లైటింగ్‌ సరిగా లేదని చెప్పినా.. అంపైర్‌ మరో ఓవర్‌ వేయించడం అశ్విన్‌కు కోపం తెప్పించింది. ఆ కోపాన్ని బ్యాటింగ్‌లోనూ చూపించాడు అశ్విన్‌. రెహాన్‌ అహ్మద్‌ వేసిన 93వ ఓవర్‌లో ఐదో బంతికి ఒక ఫోర్‌ కొట్టి.. ఆవేశంగానే బయటికి వెళ్తూ.. అంపైర్‌తో గొడవకు దిగాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.