iDreamPost
android-app
ios-app

Ravichandran Ashwin: సరికొత్త చరిత్ర లిఖించిన అశ్విన్‌! దిగ్గజాల రికార్డు గల్లంతు

  • Published Feb 16, 2024 | 5:36 PM Updated Updated Feb 16, 2024 | 5:36 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ 500వ వికెట్‌ తీసుకుని.. టెస్ట్‌ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. అయితే.. ఈ రికార్డుతో పాటు మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అది ఏంటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ 500వ వికెట్‌ తీసుకుని.. టెస్ట్‌ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. అయితే.. ఈ రికార్డుతో పాటు మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అది ఏంటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 16, 2024 | 5:36 PMUpdated Feb 16, 2024 | 5:36 PM
Ravichandran Ashwin: సరికొత్త చరిత్ర లిఖించిన అశ్విన్‌! దిగ్గజాల రికార్డు గల్లంతు

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక అరుదైన ఘనతను సాధించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో 500 వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో చేరిపోయాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలేను అవుట్‌ చేయడం ద్వారా అశ్విన్‌ ఈ అరుదైన మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు. టీమిండియా నుంచి 500 టెస్ట్‌ వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా, ప్రపంచ వ్యాప్తంగా 9వ బౌలర్‌గా అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. అయితే.. టీమిండియా నుంచి 500 టెస్ట్‌ వికెట్ల మార్క్‌ను అందుకున్న మొట్టమొదటి ఆఫ్‌ స్పిన్నర్‌గా అశ్విన్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. అయితే.. ఈ రికార్డుతో పాటు మరో అరుదైన రికార్డును సైతం అశ్విన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

రవిచంద్రన్‌ అశ్విన్‌ 2011 నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఆడిన తొలి టెస్ట్‌లోనే 9 వికెట్లతో సత్తా చాటిన అశ్విన్‌.. టీమిండియా కొత్త ఆశాదీపంలా కనిపించాడు. అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌ లాంటి ప్లేయర్లు భారత జట్టుకు దూరమైన తర్వాత అంతటి మ్యాచ్‌ విన్నింగ్స్‌ స్పిన్నర్‌గా అశ్విన్‌ మారాడు. వారి లోటును భర్తీ చేస్తూ.. ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాకు విజయాలను అందించాడు. తొలి మ్యాచ్‌ నుంచి అశ్విన్‌ వెనుదిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా టెస్ట్‌ క్రికెట్‌లో భారత్‌కు కీ ప్లేయర్‌గా మారిపోయాడు. ఈ క్రమంలోనే 50 వికెట్లను అత్యంత వేగంగా తీసుకున్న బౌలర్‌గా అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. అదే సూపర్‌ అనుకుంటే… ఇప్పుడు 500వ వికెట్‌ విషయంలోనూ అశ్విన్‌ అదే పరంపరను కొనసాగించాడు.

from 50 to 500

టీమిండియా తరఫున అత్యంత వేగంగా 500 వికెట్ల మార్క్‌ అందుకున్న బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు నమోదు చేశాడు. ఇదే కాదు.. 50 నుంచి 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500 ఇలా ప్రతి మైల్‌స్టోన్‌ను అత్యంత తక్కువ మ్యాచ్‌ల్లో అందుకున్నాడు. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన 500వ వికెట్‌ను పూర్తి చేసుకోవడంతో ఈ అరుదైన రికార్డు వెలుగు చూసింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ కంటే ముందు అనిల్‌ కుంబ్లే 500 వికెట్ల మార్క్‌ను అందుకున్నా.. అశ్విన్‌ కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఆయన ఈ ఘనత అందుకున్నాడు. కానీ, 50 వికెట్ల మార్క్‌ నుంచి ప్రతీ మైల్‌స్టోన్‌ వద్ద అనిల్‌ కుంబ్లేతో పాటు మరికొంతమంది బౌలర్ల రికార్డును బద్దలు కొట్టుకుంటూ.. అశ్విన్‌ 500 వరకు అదే పంథాను కొనసాగించడం విశేషం. మరి అత్యంత వేగంగా అశ్విన్‌ 500వ టెస్ట్‌ వికెట్‌ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.