iDreamPost
android-app
ios-app

4వ టెస్ట్‌: కొత్త చరిత్ర లిఖించిన అశ్విన్‌! తొలి భారత క్రికెటర్‌గా!

  • Published Feb 23, 2024 | 1:39 PM Updated Updated Feb 23, 2024 | 1:39 PM

Ravichandran Ashwin: భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో అరుదైన రికార్డును సాధించాడు. ఇటీవల ముగిసిన మూడో టెస్టుతో 500 టెస్ట్‌ వికెట్లు తీసుకున్న అశ్విన్‌.. తాజాగా మరో ఘనత అందుకున్న తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Ravichandran Ashwin: భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో అరుదైన రికార్డును సాధించాడు. ఇటీవల ముగిసిన మూడో టెస్టుతో 500 టెస్ట్‌ వికెట్లు తీసుకున్న అశ్విన్‌.. తాజాగా మరో ఘనత అందుకున్న తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 23, 2024 | 1:39 PMUpdated Feb 23, 2024 | 1:39 PM
4వ టెస్ట్‌: కొత్త చరిత్ర లిఖించిన అశ్విన్‌! తొలి భారత క్రికెటర్‌గా!

రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో మొదలైన నాలుగో టెస్టు తొలి సెషన్‌లోనే టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే మూడో టెస్టుతో 500 వికెట్ల క్లబ్‌లో చేరిన అశ్విన్‌.. తాజాగా మరో అరుదైన రికార్డును అశ్విన్‌ సాధించాడు. ఇంగ్లండ్‌పై 100 టెస్టు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. టెస్టుల్లో 619 వికెట్లు తీసిన దిగ్గజ బౌలర్‌ అనిల్‌ కుంబ్లేకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. అలాం​టి అరుదైన రికార్డును తాజాగా అశ్విన్‌.. జానీ బెయిర్‌ స్టోను అవుట్‌ చేయడంతో సాధించాడు. ఇన్నింగ్స్‌ 22వ ఓవర్‌ రెండో బంతిని బెయిర్‌ స్టో మోకాళ్లపై కూర్చోని స్వీప్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, బాల్‌ను పూర్తిగా మిస్‌ అయి.. వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఈ వికెట్‌తో అశ్విన్‌ ఇంగ్లండ్‌పై వంద టెస్టు వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన అశ్విన్‌ 502 వికెట్లు పడగొట్టాడు. అలాగే 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు తీసుకున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌ మంచి స్టార్టే ఇచ్చారు. 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు దాటించారు. అప్పటికే ఒక సారి ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో జాక్‌ క్రాలే బౌల్డ్‌ అయినా అది నో బాల్‌ కావడంతో బతికిపోయాడు. కానీ, ఆ వెంటనే ఆకాశ్‌ దీప్‌ ఏకంగా మూడు వికెట్లతో చెలరేగాడు. జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌లను అవుట్‌ చేసి.. తన తొలి టెస్టులోనే ఇలాంటి ప్రదర్శనతో ఆకాశ్‌ దీప్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు.

ashwin creates history

ఆకాశ్‌ దీప్‌ మూడు వికెట్లతో చెలరేగిన తర్వాత.. అశ్విన్‌, జడేజా చెరో వికెట్‌ తీసి.. లంచ్‌ కంటే ముందే ఐదు వికెట్లు పడగొట్టారు. జాక్‌ క్రాలే 42, బెన్‌ డకెట్‌ 11, ఓలీ పోప్‌ 0, జానీ బెయిర్‌ స్టో 38, బెన్‌ స్టోక్స్‌ 3 పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. ఇప్పటికే రెండు వరుస ఓటములతో డీలా పడిన ఇంగ్లండ్‌.. నాలుగో టెస్టులో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో ఆ జట్టులో ఆశలు చిగురించాయి. కానీ, టీమిండియా బౌలర్లు చెలరేగి బౌలింగ్‌ చేయడంతో.. 112 పరుగులకే 5 కోల్పోవడంతో ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. మరి ఈ మ్యాచ్‌లో ఆకాశ్‌ దీప​ ప్రదర్శనతో పాటు, అశ్విన్‌ సాధించిన అరుదైన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.