Somesekhar
వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఆ రికార్డు ఏంటి? వివరాల్లోకి వెళితే..
వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఆ రికార్డు ఏంటి? వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఏ ప్లేయర్ కైనా వందో టెస్ట్ అంటే ఓ ప్రత్యేక అనుభూతి ఉంటుంది. ప్రస్తుతం అశ్విన్ కూడా ఇదే సంతోషాన్ని పొందుతున్నాడు. కానీ తన చిరస్మరణీయ మ్యాచ్ లో ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. మరి ఆ వరస్ట్ రికార్డు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి ఇంగ్లండ్ తక్కువ పరుగులకే ఆలౌట్ కావడంలో కీ రోల్ పోషించాడు. అశ్విన్ కెరీర్ లో ఇది వందో టెస్ట్ కావడంతో.. మరపురాని అనుభూతులను క్రియేట్ చేయాలని అనుకున్నాడు. కానీ అనూహ్యంగా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంతితో రాణించిన అశ్విన్ బ్యాట్ తో నిరాశపరిచాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగి వందో టెస్ట్ లో డకౌట్ అయిన మూడో భారత క్రికెటర్ గా నిలిచాడు.
ఇక ఈ లిస్ట్ లో డకౌట్ అయిన మెుట్టమెుదటి ఆటగాడిగా దిలీప్ వెంగ్ సర్కార్ నిలిచాడు. చతేశ్వర్ పుజారా కూడా వందో టెస్ట్ లో సున్నాకే వెనుదిరిగాడు. ఓవరాల్ గా వందో టెస్ట్ లో డకౌట్ అయిన తొమ్మిదో ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. ఈ లిస్ట్ లో దిగ్గజ క్రికెటర్లు ఉండటం గమనార్హం. అలెన్ బోర్డర్, కోట్నీ వాల్ష్, మార్క్ టేలర్, స్టీఫెన్ ప్లెమింగ్, మెక్ కల్లమ్, అలిస్టర్ కుక్ లు తమ తమ వందో టెస్ట్ లో డకౌట్ గా వెనుదిరిగారు. మరి అశ్విన్ ఈ చెత్త రికార్డు నెలకొల్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: సెంచరీ చేసినా.. గిల్ చేసింది పెద్ద తప్పు! కొడుకుపై తండ్రి షాకింగ్ కామెంట్స్