iDreamPost

సెంచరీ చేసినా.. గిల్ చేసింది పెద్ద తప్పు! కొడుకుపై తండ్రి షాకింగ్ కామెంట్స్

శుబ్ మన్ గిల్ సెంచరీ కొట్టినా అతడి తండ్రి మాత్రం హ్యాపీగా లేడు. దానికి కారణం గిల్ చేసిన ఓ పెద్ద తప్పు. మరి ఆ తప్పు ఏంటి? గిల్ తండ్రి ఎందుకు సంతోషంగా లేడు? ఆ వివరాల్లోకి వెళితే..

శుబ్ మన్ గిల్ సెంచరీ కొట్టినా అతడి తండ్రి మాత్రం హ్యాపీగా లేడు. దానికి కారణం గిల్ చేసిన ఓ పెద్ద తప్పు. మరి ఆ తప్పు ఏంటి? గిల్ తండ్రి ఎందుకు సంతోషంగా లేడు? ఆ వివరాల్లోకి వెళితే..

సెంచరీ చేసినా.. గిల్ చేసింది పెద్ద తప్పు! కొడుకుపై తండ్రి షాకింగ్ కామెంట్స్

టీమిండియా యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో రెండు శతకాలతో దుమ్మురేపాడు. వరుసగా 10 ఇన్నింగ్స్ ల్లో ఫిఫ్టీ కూడా సాధించలేదని అతడిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు రెండో టెస్టులో సెంచరీ చేయడం ద్వారా కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ లోనూ అద్భుతమైన శతకంతో చెలరేగాడు ఈ యంగ్ బ్యాటర్. అయితే గిల్ సెంచరీ కొట్టినా అతడి తండ్రి మాత్రం హ్యాపీగా లేడు. దానికి కారణం గిల్ చేసిన ఓ పెద్ద తప్పు. మరి ఆ తప్పు ఏంటి? గిల్ తండ్రి ఎందుకు సంతోషంగా లేడు? ఆ వివరాల్లోకి వెళితే..

శుబ్ మన్ గిల్ అద్భుతమైన శతకం సాధించడంతో ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. గిల్ తో పాటుగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సూపర్ సెంచరీతో చెలరేగాడు. అయితే గిల్ సెంచరీ చేసినా అతడి తండ్రి లఖ్విందర్ సింగ్ సంతోషంగా లేడట. దానికి కారణం ఏంటి? అని ఆరాతీయగా.. అతడు ఓ బలమైన రీజన్ చెప్పుకొచ్చాడు. గిల్ తీసుకున్న ఓ నిర్ణయం తనకు నచ్చలేదని పేర్కొన్నాడు.

శుబ్ మన్ గిల్ టెస్టుల్లో ఓపెనర్ గా కాకుండా.. వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయడం తనకు నచ్చలేదని, అది గిల్ చేసిన పెద్ద తప్పని అతడి తండ్రి, చిన్ననాటి కోచ్ లఖ్విందర్ సింగ్ తెలిపాడు. ఓపెనర్ గా కాకుండా.. వన్ డౌన్ లో రావడం వల్లే వరుసగా 10 ఇన్నింగ్స్ ల్లో ఒక్క అర్థశతకం కూడా చేయలేకపోయాడని గిల్ తండ్రి పేర్కొన్నాడు. “గిల్ తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదు. అతడు వన్ డౌన్ లో బ్యాటింగ్ దిగడం నాకు ఎంత మాత్రం నచ్చలేదు. డ్రస్సింగ్ రూమ్ లో ఎంత ఎక్కువసేపు కూర్చుంటే అంత ఒత్తిడి పెరుగుతుంది. అయితే వాడి నిర్ణయంతో నేను జోక్యం చేసుకోను. ఎందుకంటే? ఇప్పుడు వాడు పెద్దవాడైయ్యాడు” అంటూ గిల్ తండ్రి లఖ్విందర్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ మూడు ఫార్మాట్స్ లో ఓపెనర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవలే అరంగేట్రం చేసిన జైస్వాల్ ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తుండటంతో.. వన్ డౌన్ లో పుజారా స్థానంలో బ్యాటింగ్ కు దిగుతున్నాడు గిల్. మరి గిల్ విషయంలో తండ్రి లఖ్విందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: కోహ్లీ లేని లోటు ఒక్క షాట్‌తో తీర్చిన బుమ్రా! చూస్తే ఫిదా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి