Somesekhar
ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ను సెటైరికల్ గా విమర్శించాడు టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ప్రస్తుతం ఈ సిరీస్ లో కొనసాగిస్తున్న రూట్ పూర్ ఫామ్ ను తనదైనశైలిలో క్రిటిసైజ్ చేశాడు.
ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ను సెటైరికల్ గా విమర్శించాడు టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ప్రస్తుతం ఈ సిరీస్ లో కొనసాగిస్తున్న రూట్ పూర్ ఫామ్ ను తనదైనశైలిలో క్రిటిసైజ్ చేశాడు.
Somesekhar
జో రూట్.. 138 టెస్ట్ మ్యాచ్ లు, 11 వేలకు పైగా పరుగులు.. 30 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు. ఈ గణాంకాలు చూస్తేనే అర్ధమవుతోంది అతడు ఎంతటి ఆటగాడో. కానీ ఇలాంటి స్టార్ ప్లేయర్లకు సైతం కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా కఠిన పరిస్థితులు ఎదురౌతూ ఉంటాయి. తాజాగా టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో రూట్ దారుణంగా విఫలం అయ్యాడు. ఇప్పటి వరకు ఇండియాపై ఆడిన ఈ ఐదు ఇన్నింగ్స్ ల్లో కలిపి అతడు చేసిన పరుగులు వంద కూడా దాటలేదంటే అర్ధం చేసుకోవచ్చు. అయితే బౌలింగ్ లో మాత్రం కాస్త పర్వాలేదనిపించాడు ఈ స్టార్ ప్లేయర్. దీంతో అతడి పరువుతీస్తూ.. కామెంట్స్ చేశాడు టీమిండియా దిగ్గజ ప్లేయర్ రవిశాస్త్రి.
ఇండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ జో రూట్ దారుణంగా విఫలం అవుతూ వస్తున్నాడు. బ్యాటింగ్ లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. దీంతో జట్టుకు భారంగా తయ్యారైయ్యాడు. ఇక ఇదే విషయాన్ని సెటైరికల్ గా చెప్పుకొచ్చాడు భారత దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ఒక్క మాటతో రూట్ పరువుతీసేశాడు. “రూట్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు దాదాపు 89 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. కానీ బ్యాటింగ్ లో అన్ని పరుగులు కూడా చేయలేకపోయాడు” అంటూ రవిశాస్త్రి విమర్శించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రీడా ప్రపంచంలో వైరల్ గా మారాయి. ఇక ఈ సిరీస్ లో ఇప్పటి వరకు రూట్ చేసిన పరుగులు తొలి టెస్ట్ లో (29, 2), రెండో టెస్ట్ లో (5, 16). తాజాగా జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 18 రన్స్ చేసి మరోసారి నిరాశపరిచాడు రూట్.
ఇక రవిశాస్త్రి కామెంట్స్ కు నెటజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకంటే దారుణమైన విమర్శ మరోటి ఉండదేమో? అంటూ రాసుకొస్తున్నారు. ఇక మ్యచ్ విషయానికి వస్తే.. ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 319 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. దీంతో 126 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా మూడో సెషన్ వరకు 321 పరుగుల లీడ్ తో దూసుకెళ్తోంది. సెంచరీ హీరో యశస్వీ జైస్వాల్ 104 పరుగులతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. శుబ్ మన్ గిల్ 64, కుల్దీప్ యాదవ్ 3 పరుగులతో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు. మరి జో రూట్ పై రవిశాస్త్రీ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.
ఇదికూడా చదవండి: Yashasvi Jaiswal: అండర్సన్‌కు చుక్కలు చూపించిన జైస్వాల్! ఒకే ఓవర్‌లో..