Somesekhar
టీమిండియా లెజెండ్ రవిశాస్త్రి సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ తర్వాత ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి సిరీస్ లు దండగ అంటూ అసంతృప్తి వ్యక్తపరిచాడు.
టీమిండియా లెజెండ్ రవిశాస్త్రి సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ తర్వాత ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి సిరీస్ లు దండగ అంటూ అసంతృప్తి వ్యక్తపరిచాడు.
Somesekhar
టెస్ట్ క్రికెట్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో మరణశయ్యపై ఉన్న ఫార్మాట్. సంప్రదాయ బద్దమైన క్రికెట్ ఫార్మాట్ గా టెస్టు క్రికెట్ కు ఎనలేని గౌరవం ఉంది. ఇటీవలే ఈ ఫార్మాట్ గురించి టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ తో పాటుగా.. ఎందరో టీమిండియా ప్లేయర్లు తమ తమ అభిప్రాయాలను అద్భుతంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరిగింది. ఈ సిరీస్ ను ఇరు జట్లు 1-1తో సమంగా పంచుకున్నాయి. అదీకాక ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి సిరీస్ లు దండగ అని, టైమ్ వేస్ట్ అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కేవలం 5 రోజుల్లో ముగిసింది. తొలి టెస్టు మూడు, రెండో మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిశాయి. 10 రోజులు జరగాల్సిన ఈ టెస్టులు 5 రోజుల్లోనే సమాప్తం కావడం కాసింత ఆందోళనకరమే. ఇదే విషయాన్ని కాస్త ఘాటుగానే చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి. ఈ మ్యాచ్ ఫలితం తర్వాత రవిశాస్త్రి మాట్లాడుతూ..
“అసలు టెస్ట్ క్రికెట్ లో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లు టైమ్ వేస్ట్. నా దృష్టిలో ఇలాంటి సిరీస్ లు దండగ. పైగా 1-1తో ఈ సిరీస్ సమం అయ్యింది. ఇలాంటి తక్కువ మ్యాచ్ ల సిరీస్ లు నిర్వహించకపోవడమే ఉత్తమం” అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ఈ ఫార్మాట్ కాటికి దగ్గర పడుతోందని కొందరు వాదిస్తుండగా.. ఇలాంటి టైమ్ లో తక్కువ రోజుల్లో మ్యాచ్ లు ముగియడం ఆందోళనకరం. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి. మరి టీమిండియా దిగ్గజం చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ravi Shastri expresses his disappointment after the two-match Test series between India and South Africa ends in a draw. pic.twitter.com/aBFVGtAqx5
— CricTracker (@Cricketracker) January 4, 2024