iDreamPost
android-app
ios-app

రషీద్ ఖాన్ కు రతన్ టాటా 10 కోట్ల నజరానా? క్లారిటీ ఇచ్చిన వ్యాపార దిగ్గజం

  • Author Soma Sekhar Published - 03:55 PM, Mon - 30 October 23

రతన్ టాటా రషీద్ ఖాన్ కు రూ. 10 కోట్ల నజరానా ప్రకటించారనే వార్త సోషల్ మీడియాతో పాటుగా పాకిస్థాన్ లోని పలు యూట్యూబ్ ఛానల్స్ లో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.

రతన్ టాటా రషీద్ ఖాన్ కు రూ. 10 కోట్ల నజరానా ప్రకటించారనే వార్త సోషల్ మీడియాతో పాటుగా పాకిస్థాన్ లోని పలు యూట్యూబ్ ఛానల్స్ లో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.

  • Author Soma Sekhar Published - 03:55 PM, Mon - 30 October 23
రషీద్ ఖాన్ కు రతన్ టాటా 10 కోట్ల నజరానా? క్లారిటీ ఇచ్చిన వ్యాపార దిగ్గజం

వరల్డ్ కప్ లో భాగంగా.. ఇటీవల పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసింది పసికూన ఆఫ్గాన్. ఈ విజయం తర్వాత ఓ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. అదేంటంటే? ఆఫ్గాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ కు ఐసీసీ రూ. 55 లక్షల జరిమానా విధించిందని, అతడికి అంత భారీ మెుత్తంలో జరిమానా విధించడంతో.. రతన్ టాటా స్పందించి.. రషీద్ కు రూ. 10 కోట్ల నజరానా ప్రకటించారనే వార్త సోషల్ మీడియాతో పాటుగా పాకిస్థాన్ లోని పలు యూట్యూబ్ ఛానల్స్ లో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. అసలు ఐసీసీ రషీద్ ఖాన్ కు జరిమానా విధించిందా? రతన్ టాటా నిజంగానే రూ. 10 కోట్లు రషీద్ ఖాన్ ఇచ్చారా? ఈ విషయాల్లో నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇటీవల పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గాన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయోత్సవాల్లో భాగంగా ఆఫ్గాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ త్రివర్ణ పతాకాన్ని మెడలో ధరించి సంబరాలు చేసుకున్నాడని, ఈ విషయంపై పాక్ ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో.. అతడికి ఐసీసీ రూ. 55 లక్షల భారీ జరిమానా విధించిందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తో పాటుగా సోషల్ మీడియాలో కూడా వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్తలు అంతటితో ఆగకుండా.. ఇందులోకి పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను కూడా లాగారు. రషీద్ ఖాన్ కు రతన్ టాటా రూ. 10 కోట్ల నజరానా ప్రకటించాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ప్రధాన మీడియాలో ఈ వార్త ఎక్కడా వినిపించలేదు. అయితే పది కోట్ల వ్యవహారం కావడంతో.. ఈ వార్త అటుతిరిగి.. ఇటు తిరిగి రతన్ టాటా వరకు చేరింది. చివరికి ఆయన ఈ వార్తలపై స్పందించాడు.

“నాకు క్రికెట్ తో సంబంధం లేదు. పైగా నేను ఏ ఆటగాడి జరిమానా గురించి నజరానా గురించి ఐసీసీకి గానీ, మరే ఇతర క్రికెట్ కు సంబంధించిన అధికారులకు గానీ ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదు. దయచేసి ఇలాంటి వార్తలను ప్రచారం చేయకండి” అంటూ రిక్వెస్ట్ చేశారు వ్యాపార దిగ్గజం రతన్ టాటా. దీంతో స్వయంగా టాటానే ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వడంతో.. నెటిజన్లు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం రతన్ టాటా బహుశా క్రికెట్ గురించి చేసిన తొలి ట్వీట్ ఇదేనేమో అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. రషీద్ ఖాన్ కు సంబంధించిన ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.