iDreamPost
android-app
ios-app

తీవ్ర దుఃఖంలో ఉన్న మాకు.. ఈ విజయం కాస్త సంతోషాన్నిచ్చింది: రషీద్‌ ఖాన్‌

  • Author Soma Sekhar Published - 12:35 PM, Mon - 16 October 23
  • Author Soma Sekhar Published - 12:35 PM, Mon - 16 October 23
తీవ్ర దుఃఖంలో ఉన్న మాకు.. ఈ విజయం కాస్త సంతోషాన్నిచ్చింది: రషీద్‌ ఖాన్‌

ఆఫ్ఘానిస్థాన్.. ఓ వైపు టెర్రరిస్టుల బాంబు దాడులు, మరో వైపు ప్రకృతి ప్రకోపం అయిన భూకంపాలు. ఈ రెండూ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నాయి. అయినప్పటికీ గుండెల నిండా బాధను దిగమింగుకుని ఆ దేశం క్రికెట్ లో ఎన్నో సంచనాలు సృష్టిస్తోంది. తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ లో జగజ్జేత అయిన ఇంగ్లాండ్ కే షాకిచ్చింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 69 పరుగుల తేడాతో విజయం సాధించి.. క్రికెట్ ప్రపంచం మనసులు గెలుచుకుంది. ఇక ఇంగ్లాండ్ పై విజయం తర్వాత ఆఫ్ఘాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. తీవ్ర దుఃఖంలో ఉన్న మాకు ఈ విజయం కాస్త సంతోషాన్ని ఇచ్చిందని భావోద్వేగానికి గురైయ్యాడు.

వరల్డ్ కప్ లో ఆఫ్ఘానిస్థాన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు షాకిస్తూ.. 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. ఈ విజయం తర్వాత ఆఫ్గాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. దానికి కారణం ఆఫ్ఘాన్ లో భూకంపం రావడమే. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఆఫ్గాన్ లో ఎంతో మరణించగా, కొన్ని వేల మంది గాయపడ్డారు. ఇప్పుడు ఇదే విషయం ఆఫ్గాన్ ప్లేయర్ల సంతోషాని దూరం చేస్తోంది. మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ మాట్లాడుతూ..

“మా దేశంలో సంతోషానికి కారణం ఏదైనా ఉందంటే? అది ఒక్క క్రికెట్ లోనే. మేం మ్యాచ్ లు గెలిస్తే.. మా దేశంలో సంతోషం వెళ్లివిరుస్తుంది. అయితే ప్రస్తుతం ఎంతో బాధలో ఉన్న మాకు ఇంగ్లాండ్ పై విజయం కాస్త ఆనందాన్ని ఇచ్చింది. తాజాగా వచ్చిన భూకంపంలో మేం సర్వస్వం కోల్పోయాం. ఈ విజయం భూకంప బాధితులకు అంకితం ఇస్తున్నాం” అంటూ భావోద్వేగానికి లోనైయ్యాడు రషీద్. ఇక ఈ మ్యాచ్ లో వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అమౌంట్ ను భూకంప బాధితులకు డొనేట్ చేశాడు ముజీబ్ రెహ్మన్. కాగా.. రషీద్ ఖాన్ తన టోర్నీ మెుత్తం ఫీజును భూకంప బాధితులకు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ క్రికెట్ లో సంచనాలు సృష్టిస్తూ.. ముందుకెళ్తున్న ఆఫ్గాన్ క్రికెట్ టీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.