iDreamPost
android-app
ios-app

IND vs PAK మ్యాచ్.. మహిళా పోలీస్ పై చేయి చేసుకున్న ప్రేక్షకుడు! వైరల్ వీడియో..

  • Author Soma Sekhar Published - 09:56 AM, Mon - 16 October 23
  • Author Soma Sekhar Published - 09:56 AM, Mon - 16 October 23
IND vs PAK మ్యాచ్.. మహిళా పోలీస్ పై చేయి చేసుకున్న ప్రేక్షకుడు! వైరల్ వీడియో..

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరుగుతుంటే కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇద్దరు ఆటగాళ్లు గొడవకు దిగటం, అభిమానులు కొట్టుకోవడం, లవ్ ప్రపోజల్స్, అభిమానులు ఫొటోల కోసం గ్రౌండ్ లోకి దూసుకురావడం లాంటి ఎన్నో సంఘటనలు మనం చూశాం. కానీ వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-పాక్ మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రేక్షకుడు డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ పై చేయి చేసుకున్నాడు. దీంతో సదరు లేడీ కానిస్టేబుల్ సైతం ధీటుగా బదులిచ్చింది. వారిద్దరి మధ్య మాటల యుద్దం పెరగడంతో.. పక్కన ఉన్నవారు వారిని ఆపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

వరల్డ్ కప్ లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ మహిళా పోలీస్ ప్రేక్షకుల మధ్యలో విధులు నిర్వర్తిస్తోంది. మ్యాచ్ చూడ్డానికి వచ్చిన ఓ ప్రేక్షకులు సీటులో కూర్చున్నాడు. వెనక నుంచి ప్రేక్షకులు వస్తుండటంతో కోపంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సదరు లేడీ పోలీస్ తో చెప్పాడు. దానికి ఆమె కూడా అంతే కోపంగా సమాధానం ఇచ్చింది.

ఈ క్రమంలోనే అతడు కూడా కోపంతో ఏదో సమాధానం ఇవ్వడంతో.. లేడీ కానిస్టేబుల్ అతడిని కొట్టింది. దీంతో అతడు కూడా డ్యూటీలో ఉన్న ఆమెపై చేయి చేసుకున్నాడు. గొడవ పెద్దది అవుతుండటంతో.. పక్కన వారు వారిద్దరి ఆదుపు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వీడియోపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఓ మహిళపై చేయి చేసుకోవడం ఏంటి? పైగా డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై. ఇలాంటి ఆకతాయిలకి తగిన బుద్దిచెప్పాలి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş