Somesekhar
ఐపీఎల్ 2023లో ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో ప్రపంచ క్రికెట్ ను తనవైపు తిప్పుకున్నాడు రింకూ సింగ్. తాజాగా తన శైలికి భిన్నంగా అద్బుతమైన బ్యాటింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్ 2023లో ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో ప్రపంచ క్రికెట్ ను తనవైపు తిప్పుకున్నాడు రింకూ సింగ్. తాజాగా తన శైలికి భిన్నంగా అద్బుతమైన బ్యాటింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు.
Somesekhar
రింకూ సింగ్.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ చిచ్చర పిడుగు అనతికాలంలోనే టీమిండియాలోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్ 2023లో ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో ప్రపంచ క్రికెట్ ను తనవైపు తిప్పుకున్నాడు. దీంతో టీ20లు, వన్డే జట్టులో చోటుదక్కించుకుని అందరి ఆశ్చర్యానికి గురిచేశాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ లకు మారుపేరుగా నిలుస్తూ వస్తున్న రింకూ.. టీమిండియాకు ఫినిషర్ గా మారాడు. అయితే అతడు త్వరలోనే టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో ఉత్తరప్రదేశ్ జట్టు తరఫున ఆడుతున్నాడు ఈ ఫినిషర్. అందులో భాగంగా తాజాగా కేరళతో ప్రారంభమైన మ్యాచ్ లో తనలోనూ ఓ టెస్ట్ బ్యాటర్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో అందరిని అబ్బురపరిచాడు.
రింకూ సింగ్ త్వరలోనే టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే టీ20 జట్టులో తన ప్లేస్ ను సుస్థిరం చేసుకున్న ఈ ఫినిషర్.. టెస్టు క్రికెట్ కు కూడా సై అంటున్నాడు. ఇటీవలే ప్రారంభమైన రంజీ ట్రోఫీలో యూపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఈ స్టార్ బ్యాటర్. తాజాగా కేరళతో జరుగుతున్న మ్యాచ్ లో తనలో ఉన్న ఫినిషర్ ను సైతం పక్కనపెట్టి, టెస్టు బ్యాటర్ గా మారాడు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో 103 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి యూపీ జట్టుట 5 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది.
ఇదిలా ఉండగా.. ఒక దశలో యూపీ టీమ్ 124 రన్స్ కే సగం వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ధృవ్ జురెల్(54)తో కలిసి 100 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తన సహజసిద్ద ఆటకు వ్యతిరేకంగా ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు రింకూ. సహజంగానే మనకు రింకూ సింగ్ పేరు వినపడగానే సిక్సర్లు, ఫోర్లే గుర్తుకు వస్తాయి. అలాంటిది.. అతడి నుంచి ఇలాంటి ఒక టెస్ట్ ఇన్నింగ్స్ రావడంతో, ఫ్యాన్స్ ఇది అస్సలు ఊహించలేదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక స్టార్ ప్లేయర్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు రింకూలో ఉన్నాయంటూ కితాబిస్తున్నారు. రింకూ ఇలాగే ఆడితే త్వరలోనే టీమిండియా టెస్ట్ జట్టులో కూడా చోటు సంపాదించుకోవడం ఖాయమంటున్నారు క్రీడా పండితులు. మరి రింకూ సింగ్ తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rinku Singh 71 notout took UP from 120-5 to 244-5
Backbone of Uttar Pradesh Cricket.🦁 pic.twitter.com/xi7ZtZPqdR
— KKR Bhakt 🇮🇳 ™ (@KKRSince2011) January 5, 2024