iDreamPost
android-app
ios-app

Ricky Bhui: భారీ సెంచరీ చేసినా నో సెలబ్రేషన్స్.. అసలు కారణం చెప్పిన రికీ భుయ్!

  • Published Jan 10, 2024 | 8:41 PM Updated Updated Jan 10, 2024 | 8:41 PM

భారీ సెంచరీ చేసినా.. ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు ఆంధ్ర బ్యాటర్ రికీ భుయ్. దానికి గల కారణాలను మ్యాచ్ అనంతరం వెల్లడించాడు ఈ ఆటగాడు.

భారీ సెంచరీ చేసినా.. ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు ఆంధ్ర బ్యాటర్ రికీ భుయ్. దానికి గల కారణాలను మ్యాచ్ అనంతరం వెల్లడించాడు ఈ ఆటగాడు.

Ricky Bhui: భారీ సెంచరీ చేసినా నో సెలబ్రేషన్స్.. అసలు కారణం చెప్పిన రికీ భుయ్!

దేశవాళీ క్రికెట్ లో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన రంజీ ట్రోఫీ 2024 సీజన్ ప్రారంభం అయ్యింది. జనవరి 5 నుంచి మ్యాచ్ లు ప్రారంభం కాగా.. ప్లేయర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్ ను డ్రాతో ప్రారంభించింది ఆంధ్ర టీమ్. విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియంలో బెంగాల్ తో జరిగిన మ్యాచ్ ను డ్రాగా ముగించుకుంది. దీంతో ఆంధ్ర జట్టుకు మూడు పాయింట్లు లభించాయి. ఇక ఈ మ్యాచ్ లో భారీ శతకంతో చెలరేగాడు ఆంధ్ర ప్లేయర్ రికీ భుయ్. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన అతడు 347 బంతుల్లో 23 ఫోర్లు, ఓ సిక్సర్ తో 175 పరుగులు చేసి, లాస్ట్ వికెట్ గా వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదేంటంటే? రికీ భుయ్ సెంచరీ చేసిన తర్వాత ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు. మ్యాచ్ అనంతరం దానికి కారణాన్ని చెప్పుకొచ్చాడు.

రికీ భుయ్.. ఆంధ్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇతను రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్ లోనే భారీ శతకంతో మెరిశాడు. దీంతో బెంగాల్ తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రికీ భుయ్ మారథాన్ ఇన్నింగ్స్ ఆడి 347 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సర్ తో 175 పరుగులు చేశాడు. దీంతో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది. మిగతా ప్లేయర్లు భారీ స్కోర్లు చేయకున్నా.. రికీ భుయ్ తన అద్భుత బ్యాటింగ్ తో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. అతడు ఆదుకోకపోయి ఉంటే.. టీమ్ ఓటమిపాలై ఉండేది.

అయితే ఈ మ్యాచ్ లో అద్భుతమైన శతకం చేసిన రికీ భుయ్ సెంచరీ తర్వాత ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ ఆటగాడికైనా సెంచరీ అనేది ఓ మెల్ స్టోన్ లాంటింది. దీంతో శతకం తర్వాత క్యాజువల్ గానే ప్లేయర్లు తమ స్టైల్లో తమ సంతోషాన్ని తెలియజేస్తూ ఉంటారు. కానీ రికీ భుయ్ మాత్రం సెంచరీ చేసినా, 150 మార్క్ దాటినా ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు. అదీకాక జట్టులోని ఇతర ప్లేయర్లు కూడా నిలబడి చప్పట్లు కొట్టి అభినందించింది కూడా లేదు. ఇందుకు గల రీజన్ ను చెప్పుకొచ్చాడు రికీ భుయ్.

రంజీ ట్రోఫీ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు ఆంధ్ర జట్టు. దీంతో ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలన్న కసితో బరిలోకి దిగింది. అందులో భాగంగా కెప్టెన్ హనుమ విహారితో పాటుగా జట్టు సభ్యులందరూ ఓ నిర్ణయం తీసుకున్నారట. టైటిల్ గెలిచే వరకు ఆటగాళ్లు సెంచరీ లాంటి వ్యక్తి రికార్డులను సెలబ్రేట్ చేసుకోవద్దని నిర్ణయించుకున్నారట. దీంతో రికీ భుయ్ సైతం ఇదే ఫాలో అయ్యాడు. టైటిల్ గెలవడమే టీమ్ ఏకైక లక్ష్యమని చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.