Prithvi Shaw: చరిత్ర సృష్టించిన పృథ్వీ షా.. ఏకైక భారత క్రికెటర్​గా అరుదైన రికార్డు!

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా చరిత్ర సృష్టించాడు. అరుదైన ఫీట్​ను నమోదు చేశాడు. ఈ ఘనత అందుకున్న ఏకైక భారత క్రికెటర్​గా నిలిచాడు.

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా చరిత్ర సృష్టించాడు. అరుదైన ఫీట్​ను నమోదు చేశాడు. ఈ ఘనత అందుకున్న ఏకైక భారత క్రికెటర్​గా నిలిచాడు.

ఎంతో టాలెంట్ ఉన్నా కొందరు క్రికెటర్లు తమ కెరీర్​లో అనుకున్నంత ఎత్తుకు ఎదగలేకపోయారు. స్వయంగా చేసిన తప్పులు దీనికి కారణమైతే.. బోర్డుల నుంచి మద్దతు లేకపోవడం, సెలక్టర్లు కరుణించకపోవడం కూడా రీజన్ అని చెప్పొచ్చు. ఏదేమైనా కెరీర్​లో ఎక్కడో ఉంటాడనుకుంటే.. ఎవరికీ కనిపించకుండా ఉండిపోతారు. స్టార్లుగా ఓ వెలుగు వెలగాల్సినోళ్లు అనామకులుగా మిగిలిపోతారు. ఈ లిస్టులో భారత డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షాను తప్పక చేర్చొచ్చు. అద్భుతమైన టైమింగ్, మంచి బ్యాటింగ్ టెక్నిక్, బాల్​ మెరిట్​ను బట్టి షాట్స్ ఆడుతూ సూపర్బ్ బ్యాటర్​గా పేరు తెచ్చుకున్నాడు షా. కానీ స్వీయ తప్పిదాలతో జట్టుకు దూరమయ్యాడు. టీమిండియాలో వచ్చిన అరకొర అవకాశాలను సరిగ్గా వాడుకోలేకపోయాడు. అధిక బరువు వల్ల సమస్యలు ఎదుర్కొన్నాడు. ఫామ్ లేమి, గాయాల కారణంగా దూరమైన షా.. తనదైన శైలిలో ప్రొఫెషనల్ క్రికెట్​లో కమ్​బ్యాక్ ఇచ్చాడు. సూపర్ సెంచరీతో అరుదైన ఘనత అందుకున్నాడు.

రంజీ ట్రోఫీ-2024లో ముంబై తరపున బరిలోకి దిగిన పృథ్వీ షా అదరగొడుతున్నాడు. సూపర్బ్ నాక్స్​తో చెలరేగిపోతున్నాడు. తాజాగా ఛత్తీస్​గఢ్​తో జరిగిన మ్యాచ్​లో 185 బంతుల్లో 159 పరుగులు చేశాడు. 107 బంతుల్లోనే సెంచరీ మార్క్​ను అందుకున్నాడు షా. అప్పటికే 13 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆ తర్వాత మరో ఐదు బౌండరీలు, ఓ భారీ సిక్సర్ కొట్టాడు. ఈ సెంచరీ ద్వారా అరుదైన ఘనతను తన పేరు మీద లిఖించుకున్నాడు. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో ఫస్ట్ డే లంచ్​కు ముందే కెరీర్​లో రెండు సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్​గా రికార్డు నమోదు చేశాడు. గతంలో అసోం మీద 379 బంతుల్లో 383 పరుగులు చేసిన షా.. రంజీ ట్రోఫీలోనే రెండో అత్యధిక స్కోరు సాధించాడు. అప్పుడు కూడా మొదటి రోజు లంచ్​కు ముందే శతకం మార్క్​ను అందుకున్నాడు.

పృథ్వీ షాతో పాటు భూపెన్ లవ్లానీ (102) కూడా సెంచరీతో మెరవడంతో ముంబై తొలి ఇన్నింగ్స్​లో 351 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఛత్తీస్​గఢ్​ రెండో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆ టీమ్ బ్యాటర్లలో శశాంక్ చంద్రశేఖర్ (56) హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. ఇక, సూపర్ సెంచరీతో చరిత్ర సృష్టించిన పృథ్వీ షాపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. తాము షా నుంచి ఇదే కోరుకుంటున్నామని అంటున్నారు. అతడిలో ఎంతో ప్రతిభ దాగి ఉందని.. కాస్త క్రమశిక్షణతో ఉండి ఫిట్​గా తయారైతే పృథ్వీని ఎవరూ ఆపలేరని కామెంట్స్ చేస్తున్నారు. బ్యాటింగ్​లో వంక పెట్టడానికి లేదని.. మిగిలిన విషయాలను సెట్ చేసుకుంటే భారత జట్టులో రీఎంట్రీ ఇవ్వడం సాధ్యమేనని చెబుతున్నారు. మరి.. షా అరుదైన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments