రంజీ విన్నర్​గా ముంబై.. ఈ సెంటిమెంట్​ వర్కౌటైతే ఐపీఎల్​లో కోహ్లీని ఆపలేం!

రంజీ ట్రోఫీ 2023-24లో ముంబై జట్టు ఛాంపియన్​గా అవతరించింది. దీంతో ఆ టీమ్ ఫ్యాన్స్​ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అదే టైమ్​లో ఆర్సీబీ అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు. ముంబై గెలిస్తే ఆర్సీబీ ఎందుకు హ్యాపీగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

రంజీ ట్రోఫీ 2023-24లో ముంబై జట్టు ఛాంపియన్​గా అవతరించింది. దీంతో ఆ టీమ్ ఫ్యాన్స్​ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అదే టైమ్​లో ఆర్సీబీ అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు. ముంబై గెలిస్తే ఆర్సీబీ ఎందుకు హ్యాపీగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎట్టకేలకు రంజీ ట్రోఫీ 2023-24 ముగిసింది. క్రికెట్ ప్రేమికులను పలు నెలల పాటు అలరించిన ఈ డొమెస్టిక్ టోర్నమెంట్​లో ముంబై జట్టు విజేతగా ఆవిర్భవించింది. విదర్భతో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో 169 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి కప్పు ఎగరేసుకుపోయింది ముంబై. రంజీ ట్రోఫీలో ఛాంపియన్​గా నిలవడం ఆ టీమ్​కు ఇది 42వ సారి కావడం విశేషం. ఈ విక్టరీతో రంజీల్లో తన డామినేషన్​ను మరోమారు ప్రూవ్ చేసింది ముంబై. ఈ విజయాన్ని జట్టు ఆటగాళ్లతో పాటు ముంబై అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే వీళ్లతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కూడా ఇప్పుడు సంబురాల్లో మునిగిపోయారు. ముంబై విజయాన్ని వాళ్లు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి ఓ కారణం ఉంది. ముంబై గెలుపునకు, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మధ్య ఓ కనెక్షన్ ఉంది.

ముంబై రంజీ విన్నర్​గా నిలవడంతో ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో విరాట్ కోహ్లీకి ఎదురుండదని ఆర్సీబీ అభిమానులు అంటున్నారు. వాళ్లు ఇలా అనడానికి ఓ రీజన్ ఉంది. ముంబై గెలుపునకు కోహ్లీకి ఓ కనెక్షన్ ఉంది. అదేంటంటే.. ముంబై రంజీ ట్రోఫీ నెగ్గడం విరాట్​కు కలిసొస్తోంది. ఆ జట్టు ఛాంపియన్​గా నిలిచిన 2015-16 సీజన్​లో ఐపీఎల్​లో కోహ్లీ అదరగొట్టాడు. 2016 క్యాష్ రిచ్ లీగ్​ సీజన్​లో కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేశాడు. బెంగళూరు కప్పు కొట్టకపోయినా ఆ సీజన్​లో కింగ్​ను ఆపడం ఎవరి తరం కాలేదు. అతడి బ్యాట్ ఓ రేంజ్​లో గర్జించింది. ఏ బౌలర్​ను లెక్కచేయకుండా చిత్తుచిత్తుగా బాదిపారేశాడు కోహ్లీ. పరుగుల సునామీతో అపోజిషన్ టీమ్స్​ను ముంచేశాడు. ఇదేం విధ్వంసం రా బాబు అని అన్ని టీమ్స్ వణికిపోయాయి.

గత ఏడాది ఐపీఎల్​లో కూడా అద్భుతంగా ఆడిన కోహ్లీ.. ఈసారి కూడా అదరగొట్టాలని చూస్తున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో ముంబై జట్టు మళ్లీ రంజీ ట్రోఫీని నెగ్గింది. గురువారం ముగిసిన రంజీ ఫైనల్​లో విదర్భ టీమ్​ను ఓడించి విజేతగా ఆవిర్భవించింది ముంబై. దీంతో ఈ సెంటిమెంట్ రిపీటైతే ఈసారి ఐపీఎల్​లో కోహ్లీ పరుగుల సునామీ సృష్టించడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ముంబై రంజీ సెంటిమెంట్ కింగ్​కు కలిసొస్తుందని.. ఇక అతడ్ని ఆపడం ఎవరి తరం కాదని కామెంట్స్ చేస్తున్నారు. కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్న విరాట్ ఈసారి మరింత రెచ్చిపోయి ఆడటం పక్కా అని చెబుతున్నారు. మరి.. ముంబై-కోహ్లీ సెంటిమెంట్​ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments