Nidhan
ముంబై జట్టు అనుకున్నది సాధించింది. డొమెస్టిక్ క్రికెట్లో తనను మించిన టీమ్ లేదని మరోమారు ప్రూవ్ చేసింది. మరోసారి రంజీ ఛాంపియన్‌గా అవతరించింది.
ముంబై జట్టు అనుకున్నది సాధించింది. డొమెస్టిక్ క్రికెట్లో తనను మించిన టీమ్ లేదని మరోమారు ప్రూవ్ చేసింది. మరోసారి రంజీ ఛాంపియన్‌గా అవతరించింది.
Nidhan
డొమెస్టిక్ క్రికెట్లో తనను మించిన టీమ్ మరొకటి లేదని ముంబై మరోమారు ప్రూవ్ చేసింది. తనను కొట్టాలంటేనే అపోజిషన్ టీమ్ భయపడేలా ఆ టీమ్ విజయయాత్ర నడుస్తోంది. తాజాగా ఇది మరోమారు నిరూపితమైంది. రంజీ ట్రోఫీ-2024లో విజేతగా ఆవిర్భవించింది ముంబై. 42వ సారి ఈ టోర్నమెంట్లో విన్నర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. రంజీ ట్రోఫీ హిస్టరీలో ఎక్కువగా ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ముంబైనే. ఈ టీమ్ ఇప్పటిదాకా 42 సార్లు విజేతగా నిలిచింది.
ముంబై తర్వాత ప్లేసుల్లో కర్ణాటక (8), ఢిల్లీ (7) ఉన్నాయి. దీన్ని బట్టి ఈ టోర్నమెంట్లో ముంబై హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 537 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన విదర్భ.. 368 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న డొమెస్టిక్ లెజెండ్ ధవల్ కులకర్ణి చివరి వికెట్ తీసి సంతోషంలో మునిగిపోయాడు. అప్పటికే 9 వికెట్లు పడటం, విజయానికి ఒకే వికెట్ దూరంలో ఉండటంతో కెప్టెన్ అజింక్యా రహానె వెంటనే కులకర్ణిని బౌలింగ్‌కు దింపాడు. పర్ఫెక్ట్ ఇన్‌స్వింగర్ వేసిన అతడు ఉమేష్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ముంబై జట్టు సంబురాల్లో మునిగిపోయింది. ట్రోఫీ నెగ్గడంతో కులకర్ణికి టీమ్మేట్స్ ఘనమైన వీడ్కోలు ఇచ్చినట్లయింది.
ఎదురుగా ఉన్నది భారీ టార్గెట్ అయినా, కంటిన్యూస్‌గా వికెట్లు పడతున్నా విదర్భ పట్టు వదల్లేదు. ఆ జట్టు బ్యాటర్లు మొండిగా బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకదశలో 350 పరుగులకు 5 వికెట్లతో విదర్భ పటిష్టంగా కనిపించింది. ఆ సమయంలో ఏదైనా సాధ్యమేనని అనిపించింది. కానీ సెంచరీ వీరుడు అక్షయ్ వాడ్కర్ (102) ఔట్ అవడంతో ఆ టీమ్ పతనం స్టార్ట్ అయింది. ఆ తర్వాత 15 పరుగుల తేడాలో మిగిలిన అన్ని వికెట్లను కోల్పోయింది విదర్భ. అక్షయ్‌తో పాటు కరుణ్ నాయర్ (74), హర్ష్ దూబె (65) రాణించారు. వీళ్లు ఎంతగా ఫైట్ చేసినా కొండంత స్కోరును ఛేజ్ చేయలేకపోయారు. కానీ విదర్భ బ్యాటర్ల పోరాటపటిమను మాత్రం మెచ్చుకోవాల్సిందే. మరి.. ముంబై రంజీ విన్నర్‌గా నిలవడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MUMBAI WINS RANJI TROPHY FOR THE RECORD 42ND TIME IN HISTORY….!!! 🤯🔥pic.twitter.com/lYXs5XFi3L
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 14, 2024