iDreamPost
android-app
ios-app

Cheteshwar Pujara: పుజారా సెంచరీ.. సూపర్బ్ నాక్​తో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నయా వాల్!

  • Published Jan 06, 2024 | 4:56 PM Updated Updated Jan 06, 2024 | 4:56 PM

నయా వాల్ ఛటేశ్వర్‌‌ పుజారా మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ సెంచరీతో వాళ్లకు స్ట్రాంగ్​గా ఇచ్చిపడేశాడు క్లాసిక్ బ్యాటర్.

నయా వాల్ ఛటేశ్వర్‌‌ పుజారా మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ సెంచరీతో వాళ్లకు స్ట్రాంగ్​గా ఇచ్చిపడేశాడు క్లాసిక్ బ్యాటర్.

  • Published Jan 06, 2024 | 4:56 PMUpdated Jan 06, 2024 | 4:56 PM
Cheteshwar Pujara: పుజారా సెంచరీ.. సూపర్బ్ నాక్​తో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నయా వాల్!

క్రికెట్​కు టీమిండియా ఎంతో మంది అద్భుతమైన ప్లేయర్లను అందించింది. బ్యాటర్ల గనిగా పేరుగాంచిన భారత్.. వరల్డ్ క్రికెట్​కు చాలా మంది బెస్ట్ బ్యాట్స్​మెన్​ను ఇచ్చింది. సునీల్ గవాస్కర్ దగ్గర నుంచి సచిన్ టెండూల్కర్ వరకు ఎందరో టీమిండియా క్రికెటర్లు తమ బ్యాటింగ్ టాలెంట్​తో కోట్లాది మంది అభిమానుల్ని అలరించారు. ప్రస్తుత క్రికెట్​లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా అదే కోవలోకి వస్తారు. అయితే వీళ్లిద్దరితో పాటు మరో క్రికెటర్ కూడా ఈ లిస్టులోకి వస్తాడు. అతనే ఛటేశ్వర్ పుజారా. కేవలం టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడే ఈ బ్యాటర్.. ఎన్నో అద్భుత ఇన్నింగ్స్​లతో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 103 టెస్టులు ఆడిన పుజారా 7 వేలకు పైగా పరుగులు చేశాడు. అయితే ఫామ్​లో లేకపోవడం, గత కొన్నాళ్లుగా ఫెయిల్ అవుతుండటంతో అతడ్ని టీమ్​కు దూరంగా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వండర్​ఫుల్ నాక్​తో సెలక్టర్లకు ఇచ్చిపడేశాడు పుజారా.

రంజీ ట్రోఫీ-2024లో భాగంగా జార్ఖండ్​తో జరుగుతున్న గ్రూప్ స్టేజ్ మ్యాచ్​లో పుజారా సెంచరీ బాదాడు. కేవలం 162 బంతుల్లోనే అతడు సెంచరీ మార్క్​ను అందుకోవడం విశేషం. సాధారణంగా స్లోగా ఆడతాడనే బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న నయా వాల్.. ఈ మ్యాచ్​లో మాత్రం వేగంగా పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో అతడికి ఇది 61వ సెంచరీ కావడం గమనార్హం. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన జార్ఖండ్ 49 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. చియాగ్ జానీ 5 వికెట్లతో సత్తా చాటాడు. ఆ తర్వాత సౌరాష్ట్ర బ్యాటింగ్​కు దిగింది. ఆ టీమ్​లో పుజారా (124 నాటౌట్)తో పాటు హార్విక్ దేశాయ్ (85), షెల్డన్ జాక్సన్ (54), అర్పిత్ వాసవద (68) రాణించారు. ప్రస్తుతం సౌరాష్ట్ర 108.4 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 364 పరుగులతో ఉంది. పుజారా జోరు చూస్తుంటే అతడు ఈజీగా డబుల్ సెంచరీ బాదుతాడని అనిపిస్తోంది. రంజీ సీజన్​ మొత్తం ఇదే ఫామ్​ను కంటిన్యూ చేస్తే పుజారా బ్యాట్ నుంచి మరిన్ని సూపర్బ్ నాక్స్ రావడం ఖాయం.

పుజారా సెంచరీ బాదడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఈ ఇన్నింగ్స్​తో సెలక్టర్లకు అతడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని అంటున్నారు. తనను సెలక్ట్ చేయకుండా పెద్ద తప్పు చేస్తున్నారని పుజారా చెప్పకనే చెబుతున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ముగిసింది ఏమీ లేదని.. ఇంగ్లండ్​తో స్వదేశంలో జరగనున్న 5 టెస్ట్​ల సిరీస్​లో అతడ్ని ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పితే టీమ్​లో స్ట్రాంగ్ ప్లేయర్లు లేరని.. ఎంతో ఎక్స్​పీరియెన్స్​ ఉన్న పుజారాను తీసుకుంటే బ్యాటింగ్ యూనిట్ మరింత బలపడుతుందని సూచిస్తున్నారు. ఇక, రీసెంట్​గా సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్​కు పుజారాను సెలక్ట్ చేయలేదు. అతడి విలువ ఏంటో ఆ సిరీస్​లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇప్పుడు సెంచరీ కొట్టాడు కాబట్టి ఇంగ్లండ్​తో సిరీస్​కైనా అతడ్ని ఎంపిక చేస్తారేమో చూడాలి. మరి.. భారత జట్టులోకి పుజారా తిరిగి రావాలని మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Sunil Gavaskar: అతడి ఫామ్ పై ఎలాంటి సందేహాల్లేవ్.. ఇంత రచ్చ దేనికి?: టీమిండియా దిగ్గజం