iDreamPost

Sunil Gavaskar: అతడి ఫామ్ పై ఎలాంటి సందేహాల్లేవ్.. ఇంత రచ్చ దేనికి?: టీమిండియా దిగ్గజం

టీమిండియాలో ఉన్న ఆ స్టార్ క్రికెటర్ ఫామ్ పై మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని, అతడిపై ఇంత రచ్చ దేనికని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మరి ఆ క్రికెటర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

టీమిండియాలో ఉన్న ఆ స్టార్ క్రికెటర్ ఫామ్ పై మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని, అతడిపై ఇంత రచ్చ దేనికని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మరి ఆ క్రికెటర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Sunil Gavaskar: అతడి ఫామ్ పై ఎలాంటి సందేహాల్లేవ్.. ఇంత రచ్చ దేనికి?: టీమిండియా దిగ్గజం

ప్రస్తుతం టీమిండియా దృష్టి మెుత్తం జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ పైనే ఉంది. ఇందుకోసం బీసీసీఐ ఎప్పటి నుంచో సన్నాహకాలను మెుదలుపెట్టింది. జట్టులో మార్పులు చేస్తూ.. యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రయోగాల బాటపట్టింది సెలెక్షన్ కమిటి. అయితే యంగ్ ప్లేయర్లు సత్తాచాటడంతో.. జట్టులోకి ఎవరిని తీసుకోవాలి? ఎవరిని పక్కనపెట్టాలి? అన్న అయోమయం సెలెక్షన్ కమిటీకి ఉత్పన్నం అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ స్టార్ క్రికెటర్ పై రచ్చ మెుదలైంది. అయితే అతడి ఫామ్ పై ఎలాంటి సందేహాలు అక్కర్లేదని, రాబోయే రోజుల్లో ఆ ప్లేయర్ అద్భుతంగా రాణిస్తాడని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయాపడ్డాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు?

టీ20 వరల్డ్ కప్ 2024.. ప్రస్తుతం టీమిండియా ముందున్న అతిపెద్ద టార్గెట్. గత దశాబ్ద కాలంగా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా నెగ్గలేదు భారత జట్టు. దీంతో ఆ కోరికను ఈ పొట్టి కప్ కొట్టి తీర్చుకోవాలన్న కసితో ఉంది. అయితే సీనియర్ బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేస్తారా? చేయరా? అన్న సందేహాలు క్రికెట్ ఫ్యాన్స్ లో నెలకొన్నాయి. వీరిద్దరు గత టీ20 వరల్డ్ కప్ తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో విరాట్, రోహిత్ లు పొట్టి ఫార్మాట్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతారంటూ అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ అదేంలేదంటూ.. కొన్ని హింట్స్ ఇచ్చింది. వారు వచ్చే టీ20 వరల్డ్ కప్ ఆడతారంటూ చెప్పకనే చెప్పింది. రోహిత్ ను కెప్టెన్ గా కొనసాగాలని బీసీసీఐ పెద్దలు కోరగా.. దానికి అతడు సుముఖంగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత దిగ్గజం, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.

ప్రముఖ ఛానల్ స్టార్ స్పోర్ట్స్ తో గవాస్కర్ మాట్లాడుతూ..”గత ఏడాదిన్నర కాలంగా విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. అదీకాక ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకుని తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. అయితే అతడి బ్యాటింగ్, ఫామ్ గురించి కొద్దికాలంగా రచ్చ జరుగుతోంది. అసలు చర్చంతా దేనికి? అతడి బ్యాటింగ్ గురించా? లేక అతడి ఫామ్ గురించా? మీరంతా ఒక్కటి గుర్తుంచుకోండి.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఫామ్ పై మీకు ఎలాంటి సందేహాలు అక్కర్లేదు” అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్. గత కొద్ది కాలంగా కోహ్లీ టీ20 కెరీర్ పై నీలినీడలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కామెంట్స్ చేశాడు గవాస్కర్. మరి కోహ్లీ టీ20 కెరీర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి