iDreamPost

20 కోట్లు ఇచ్చినా బాబర్ IPLలో ఆడడు.. రమీజ్ రాజా బుర్ర తక్కువ కామెంట్స్!

బాబర్ అజాంకు రూ. 20 కోట్లు ఇచ్చినా గానీ.. అతడు ఐపీఎల్ లో ఆడడు అంటూ మైండ్ లెస్ కామెంట్స్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా. దాంతో ఇండియన్స్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అతడిపై విరుచుకుపడుతున్నారు.

బాబర్ అజాంకు రూ. 20 కోట్లు ఇచ్చినా గానీ.. అతడు ఐపీఎల్ లో ఆడడు అంటూ మైండ్ లెస్ కామెంట్స్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా. దాంతో ఇండియన్స్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అతడిపై విరుచుకుపడుతున్నారు.

20 కోట్లు ఇచ్చినా బాబర్ IPLలో ఆడడు.. రమీజ్ రాజా బుర్ర తక్కువ కామెంట్స్!

ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆడాలని ప్రపంచ దేశాల స్టార్, యంగ్ ప్లేయర్లు ఉత్సాహం చూపిస్తుంటారు. ఒక్కసారైనా ఐపీఎల్ లో ఆడాలనుకునే ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. అలాంటి ఐపీఎల్ పై అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటారు పాక్ క్రికెటర్లు. తమే గొప్ప అంటూ డప్పు కొట్టుకునే పాక్ బ్యాచ్.. తాజాగా మరోసారి తమ పరువుపోగొట్టుకునే పని చేసింది. పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా చేసిన కామెంట్స్ పై నెటిజన్లు విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు.

ఐపీఎల్ లో పాక్ ప్లేయర్లు ఆడట్లేదన్న విషయం అందరికి తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ 2008లో మాత్రమే పాక్ ప్లేయర్లు ఆడారు. ఆ తర్వాత ఇండియా-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు వల్ల వారిని ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆడకుండా నిషేధించారు. అయితే ఒకవేళ పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ లో పాల్గొంటే వాళ్లు ఎంత ధర పలుకుతారు అన్న విషయంపై తాజాగా జరిగిన ఓ  కార్యక్రమంలో చర్చ జరిగింది. ఈ చర్చలో పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా గొప్పలకు పోయి.. బుర్ర తక్కువ కామెంట్స్ చేశాడు.

“ఐపీఎల్ ఫ్రాంచైజీలు బాబర్ అజంకు రూ. 20 కోట్లు ఇచ్చినా.. అతడు ఆ లీగ్ లో ఆడడు. ఎందుకంటే? బాబర్ కు డబ్బు కంటే దేశం ముఖ్యం. దేశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు” అని చెప్పుకొచ్చాడు రమీజ్ రాజా. ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. టీమిండియా ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ట్రోల్స్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజానికే రూ. 15 కోట్లు ఇస్తుంటే.. బాబర్ కోహ్లీ కంటే తోపా? 20 కోట్లు ఇవ్వడానికి. అసలు అతడు ఫ్రీగా ఆడతానన్నా మేం ఆడించుకోం, ఇలాంటి మైండ్ లెస్ కామెంట్స్ అన్నీ పాకిస్తాన్ వాళ్లే చేస్తారు.. అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరి రమీజ్ రాజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి