iDreamPost
android-app
ios-app

VIDEO: చంద్రయాన్‌-3లో మనుషులు వెళ్లారా? మంత్రి కామెంట్స్‌ వైరల్‌

  • Published Aug 24, 2023 | 8:14 AM Updated Updated Aug 24, 2023 | 8:14 AM
  • Published Aug 24, 2023 | 8:14 AMUpdated Aug 24, 2023 | 8:14 AM
VIDEO: చంద్రయాన్‌-3లో మనుషులు వెళ్లారా? మంత్రి కామెంట్స్‌ వైరల్‌

చంద్రయాన్‌-3 ప్రయోగం దిగ్విజయం కావడంతో యావత్‌ భారతదేశం మొత్తం సంబురాలు చేసుకుంది. దేశం గర్వించే విధంగా ఇస్రో(ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) విశ్వంలో కొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ద్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్‌ తలెత్తుకుని సగర్వంగా నిలిచింది. ఈ విజయం వెనుక ఉన్న ఇస్ట్రో శాస్త్రవేత్తలపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. జులై 14న చంద్రయాన్‌-3 రాకెట్‌ను నింగిలోకి పంపగా.. వివిధ దశలను విజయవంతంగా దాటుకుంటూ.. బుధవారం(ఆగస్టు 23న) జాబిల్లిపై విక్రమ్‌ సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్‌ అయింది. 14 రోజుల పాటు అక్కడే ఉండి దానికి నిర్దేశించిన ప్రయోగాలు పూర్తి చేయనుంది. అయితే.. ఈ చంద్రయాన్‌-3 విజయవంతమైన తర్వాత అందులో వెళ్లిన యాత్రికులకు నా సెల్యూట్‌ అంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

మంత్రి వ్యాఖ్యల తర్వాత చంద్రయాన్‌-3 ప్రయోగంలో మనుషులు కూడా చంద్రుడిపైకి వెళ్లారా? మేము వినలేదే? అంటూ కొంతమంది సోషల్‌ మీడియాలో ఆ మంత్రి వ్యాఖ్యలపై జోకులు పేల్చుతున్నారు. చంద్రయాన్‌-3లో యాత్రికులు వెళ్లారంటూ తెలియక టంగ్‌ స్లిప్‌ అయిన ఆ మంత్రి ఎవరంటే.. రాజస్థాన్‌కు చెందిన యూత్‌ అఫైర్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మినిస్టర్‌ అశోక్‌ చందనా. ఈ మంత్రిగారు.. చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండింగ్‌ పూర్తి అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రయాన్‌ విజయవంతం అయినందుకు, అందులో వెళ్లిన యాత్రికులకు సెల్యూట్‌ అంటూ పేర్కొన్నారు.

మంత్రి కామెంట్‌తో అక్కడున్న మీడియా వాళ్లు ఖంగుతిన్నారు. చంద్రయాన్‌-3లో యాత్రికులు వెళ్లడం ఏంటి? ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడు.. అసలు ఈయనకు చంద్రయాన్‌ ప్రయోగంపై అవగాహన ఉందా? అని అక్కడే చర్చికున్నారు. అయితే.. మంత్రి మాట్లాడిన వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆ మంత్రి ఓవర్‌నైట్‌లోనే ఫేమస్‌ అయిపోయి.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. దేశం గర్వించే విషయంపై కనీస అవగాహన లేని వాళ్లు కూడా మంత్రులు ఎలా అవుతున్నారంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇస్రోపై పాకిస్థాన్ నటి పొగడ్తలు.. తాము సిగ్గుతో తలదించుకుంటున్నామంటూ..!