iDreamPost
android-app
ios-app

ఇండియా vs న్యూజిలాండ్‌ సెమీస్‌కు వర్ష గండం ఉందా?

  • Published Nov 14, 2023 | 4:52 PMUpdated Nov 14, 2023 | 4:52 PM

ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ లోకం ఎదురుచూస్తోంది. రెండు బెస్ట్‌ టీమ్స్‌ మధ్య అసలు సిసలైన క్రికెట్‌ సమరం చూసేందుకు ఉవ్విళ్లు ఊరుతోంది. అయితే.. ఈ మెగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందా? అసలు అక్కడి వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ లోకం ఎదురుచూస్తోంది. రెండు బెస్ట్‌ టీమ్స్‌ మధ్య అసలు సిసలైన క్రికెట్‌ సమరం చూసేందుకు ఉవ్విళ్లు ఊరుతోంది. అయితే.. ఈ మెగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందా? అసలు అక్కడి వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Nov 14, 2023 | 4:52 PMUpdated Nov 14, 2023 | 4:52 PM
ఇండియా vs న్యూజిలాండ్‌ సెమీస్‌కు వర్ష గండం ఉందా?

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య బుధవారం తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో ఈ రెండు ఫైనల్‌ బెర్త్‌ కోసం పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఓటమి అనేదే లేకుండా సెమీస్‌కు దూసుకొచ్చిన టీమిండియా.. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొననుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. లీగ్‌ దశలో ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా.. సెమీస్‌ లాంటి నాకౌట్‌ మ్యాచ్‌లో ఒక్క ఓటమి వరల్డ్‌ కప్‌కు దూరం చేస్తోంది. దీంతో టీమిండియా కచ్చితంగా గెలవాలనే గట్టిపట్టుదలతో బరిలోకి దిగితోంది.

ఇప్పటికే లీగ్‌లో వరుసగా 9 మ్యాచ్‌లు గెలిచిన రోహిత్‌ సేన.. ఇంకో రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. విశ్వవిజేతగా అవతరిస్తోంది. మరోవైపు లీగ్‌ దశలో మంచి ప్రదర్శన కనబర్చినా.. న్యూజిలాండ్ ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయినా కూడా సెమీస్‌ చేరింది. కాగా, నాకౌట్‌ మ్యాచ్‌ల్లో బ్లాక్‌ క్యాప్స్‌ చాలా డేంజరస్‌ టీమ్‌. ఇప్పటికే మనపై ఆ జట్టుకు మంచి రికార్డు ఉంది. 2019 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లోనూ, అలాగే 2021 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ సారి అలాంటి పరిస్థితి రిపీట్‌ కాదని కూడా చాలామంది ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. ఎందుకంటే.. ఈ సారి టీమిండియా చాలా బలంగా ఉందని, కివీస్‌ కూడా మన ముందు నిలబడలేదని అంటున్నారు.

కాగా, క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెమీస్‌కు వర్ష గండం ఉందనే వార్త ప్రచారంలో ఉంది. దీంతో క్రికెట్‌ అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. రెండు బెస్ట్‌ టీమ్స్‌ మధ్య హైఓల్టేజ్‌ మ్యాచ్‌ చూసేందుకు రెడీ అవుతున్న తరుణంలో ఈ బ్యాడ్‌ న్యూస్‌ ఏంటని ఫీల్‌ అవుతున్నారు. వారందరికీ ఊరటనిస్తూ.. ముంబై వాతావరణ శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. బుధవారం వాన వచ్చే అవకాశం లేదని, 26 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఒక వేళ వర్షం వచ్చి మ్యాచ్‌ జరగపోయినా.. మధ్యలో ఆగిపోయినా.. రిజర్వ్‌ డే ఉంది. ఒక వేళ​ రిజర్వ్‌ డే సైతం వర్షార్పణం అయిదే.. టీమిండియానే నేరుగా ఫైనల్‌ చేరుతుంది. లీగ్‌ దశలో టేబుల్‌ టాపర్‌గా ఉండటంతో టీమిండియా ఫైనల్‌ వెళ్తోంది. అయితే.. టీమిండియా అలా ఫైనల్‌ వెళ్లడం కంటే.. సెమీస్‌లో కివీస్‌ను చిత్తు చేసి వెళ్తేనే ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీల్‌ అవుతారు. ఎందుకంటే.. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి