iDreamPost
android-app
ios-app

IND vs SA: సౌతాఫ్రికాపై గెలవడం అంత ఈజీ కాదు.. ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్!

  • Author Soma Sekhar Published - 10:13 PM, Wed - 6 December 23

సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలవడం అంత సులువు కాదని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలవడం అంత సులువు కాదని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  • Author Soma Sekhar Published - 10:13 PM, Wed - 6 December 23
IND vs SA: సౌతాఫ్రికాపై గెలవడం అంత ఈజీ కాదు.. ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్!

టీమిండియా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచి, మంచి జోరుమీదుంది. ఇక ఇదే జోరును సౌతాఫ్రికా పర్యటనలో కూడా కొనసాగించాలని భావిస్తోంది. కాగా.. టీ20, వన్డే, టెస్టు ఇలా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగుతోంది భారత జట్టు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ కూడా టీమిండియా నెగ్గకపోవడం గమనార్హం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో వరుసగా రెండు సార్లు ఫైనల్ చేరినప్పటికీ.. ప్రోటీస్ గడ్డపై చరిత్ర లిఖించలేకపోయింది. కాగా.. ఈసారైన టెస్టు సిరీస్ లో విజయం సాధించి టీమిండియా ఫ్యాన్స్ ను ఖుషీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ లు ఆడటానికి టీమిండియా దక్షిణాఫ్రికా బయలుదేరింది. ఈ క్రమంలోనే అక్కడి పిచ్ ల గురించి మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. ఈ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ గురించి స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడాడు. ద్రవిడ్ మాట్లాడుతూ..”సౌతాఫ్రికా పిచ్ లపై బ్యాటింగ్ సవాలుతో కూడుకున్నది. దానికి గణాంకాలే నిదర్శనం. మరీ ముఖ్యంగా జోహన్నస్ బర్గ్, సెంచూరియన్ లో బ్యాటింగ్ చేయడం ప్లేయర్లకు కఠిన సవాల్. దీంతో ప్రతీ బ్యాటర్ పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్లాన్ తో బ్యాటింగ్ చేసే ఆటగాడే ఇక్కడ విజయవంతమవుతాడు. అందుకు తగ్గట్లుగానే ఇక్కడ పిచ్ లపై ప్రాక్టీస్ అవసరం. సొంత గడ్డపై సఫారీలను ఓడించడం అంత సులువు కాదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ద్రవిడ్. ఇక ఈ సిరీస్ కోసం ప్రత్యేకించి ప్రణాళికలు సిద్దం చేసుకున్నామని, వాటిని పక్కాగా అమలు చేస్తామని చెప్పుకొచ్చాడు. ప్రతీ ఒక్క ఆటగాడు స్వేచ్చగా ఆడేవిధంగా లక్ష్యాన్ని ఏర్పరచుకున్నట్లు ద్రవిడ్ పేర్కొన్నాడు. మరి సఫారీ సిరీస్ కు ముందు హెడ్ కోచ్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.