iDreamPost
android-app
ios-app

ద్రవిడ్‌కు కోపం తెప్పించిన రిపోర్ట్‌! ఆ ప్రశ్న అడగడంతో..

  • Published Jun 20, 2024 | 11:29 AM Updated Updated Jun 20, 2024 | 11:29 AM

Rahul Dravid, IND vs AFG, T20 World Cup 2024: సూపర్‌ 8లో ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కి ముందు రాహుల్‌ ద్రవిడ్‌ సహనం కోల్పోయాడు. ఒక రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు కోపంగా సమాధానం ఇచ్చాడు. ఆ ఘటన గురించి వివరంగా తెలుసుకుందాం..

Rahul Dravid, IND vs AFG, T20 World Cup 2024: సూపర్‌ 8లో ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కి ముందు రాహుల్‌ ద్రవిడ్‌ సహనం కోల్పోయాడు. ఒక రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు కోపంగా సమాధానం ఇచ్చాడు. ఆ ఘటన గురించి వివరంగా తెలుసుకుందాం..

  • Published Jun 20, 2024 | 11:29 AMUpdated Jun 20, 2024 | 11:29 AM
ద్రవిడ్‌కు కోపం తెప్పించిన రిపోర్ట్‌! ఆ ప్రశ్న అడగడంతో..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా టీమిండియా ఈ రోజు(గురువారం) ఆఫ్ఘనిస్థాన్‌తో తమ తొలి సూపర్‌ 8 మ్యాచ్‌ ఆడనుంది. గ్రూప్‌-ఏ నుంచి టేబుల్‌ టాపర్‌గా సూపర్‌ 8లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్‌ సేన.. పసికూన ఆఫ్ఘాన్‌పై గెలిచి.. సూపర్‌ 8లో కూడా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే టీమ్‌ రెడీగా ఉంది. కాగా, ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌కి ముందు టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సమావేశంలో ఒక రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ద్రవిడ్‌ కాస్త ఇరిటేట్‌ అయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే.. ఆ ప్రశ్న ద్రవిడ్‌కు కోపం తెప్పించింది. ఎప్పుడూ కామ్‌గా ఉండే ద్రవిడ్‌ ఒక్కసారిగా తన సహనం కోల్పోయాడు.

ఇంతకీ ఆ రిపోర్టర్‌ ద్రవిడ్‌ ఏం అడిగాడు? అసలు ద్రవిడ్‌కు ఎందుకు కోపం వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 1997లో ఇండియా, వెస్టిండీస్‌ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆటగాడిగా ద్రవిడ్‌ ప్రదర్శన గురించి ఆ రిపోర్టర్‌ ప్రశ్నించాడు. ‘రాహుల్, మీరు ఆటగాడిగా ఇక్కడ(బార్బడోస్‌) ఆడాడు, 97 టెస్ట్‌ జ్ఞాపకాలు గుర్తు ఉన్నాయా? అని అడిగాడు. ఈ ప్రశ్న ద్రవిడ్‌కు చిరాకు తెప్పించినట్లు ఉంది. దానికి బదులిస్తూ.. ‘చాలా థ్యాంక్స్‌ మిత్రమా! నాకు ఇక్కడ కొన్ని మంచి జ్ఞాపకాలు కూడా ఉన్నాయి.’ అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. నిజానికి నేను అదే అడగాలని అనుకున్నాను.. ఇక్కడ మంచి మెమొరీస్‌ కోసం ఆఫ్ఘాన్‌తో ఏం చేయాలనుకుంటున్నారు అని రిపోర్టర్‌ మళ్లీ ప్రశ్నించాడు. దానికి ద్రవిడ్‌ బదులిస్తూ.. ‘గాడ్ మాన్! నేను కొత్తగా ఏం ప్రయత్నించడం లేదు!’ అని కాస్త అసహనంగా బదులిచ్చాడు.

అయితే.. 1997లో భారత్‌ వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లినప్పుడు బార్బడోస్‌లో ఒక టెస్ట్‌ మ్యాచ్‌ ఆడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో ద్రవిడ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 78, రెండో ఇన్నింగ్స్‌లో 2 పరుగులు మాత్రమే చేశాడు. ఈ గ్రౌండ్‌లో ద్రవిడ్‌కు ప్లేయర్‌గా మంచి రికార్డు లేకపోయినా.. దాన్ని నేను ఎప్పుడో మర్చిపోయానని, ఒక కోచ్‌గా ఇప్పుడు నేను ఏం చేయాలో దాని గురించే ఆలోచిస్తున్నాను అంటూ ద్రవిడ్‌ పేర్కొన్నాడు. 1997లో జరిగిన టెస్టు గురించి ఇప్పుడు ఆలోచించి.. ఆందోళన చెందనంటూ స్పష్టం చేశాడు. మరి ఎప్పుడూ కూల్‌గా ఉండే ద్రవిడ్‌ ఇలా ఇరిటేట్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.