SNP
వరల్డ్ కప్ 2023లో అదరగొట్టిన చాలా మంది ఆటగాళ్లకు ఐపీఎల్ 2024 మినీ వేలంలో భారీ డిమాండ్ ఉండనుంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ యువ ఓపెపర్ రచిన్ రవీంద్రపై కూడా ఫ్రాంచైజ్‌లు కన్నేశాయి. అయితే.. రచిన్ మాత్రం ఆర్సీబీకు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. దానికి వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు చూద్దాం..
వరల్డ్ కప్ 2023లో అదరగొట్టిన చాలా మంది ఆటగాళ్లకు ఐపీఎల్ 2024 మినీ వేలంలో భారీ డిమాండ్ ఉండనుంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ యువ ఓపెపర్ రచిన్ రవీంద్రపై కూడా ఫ్రాంచైజ్‌లు కన్నేశాయి. అయితే.. రచిన్ మాత్రం ఆర్సీబీకు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. దానికి వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఆటగాళ్ల ఇంటర్నల్ ట్రేడింగ్, రిలీజ్, రిటేన్‌తో ఒక్కసారిగా ఐపీఎల్ 2024 సీజన్ గురించి క్రికెట్ అభిమానుల్లో చర్చ మొదలైంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యా.. ఆ జట్టును వీడి తన పాత ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్‌కి మారిపోయాడు. ముంబై నుంచి కామెరున్ గ్రీన్‌ను ఆర్సీబీ తీసుకుంది. గ్రీన్ రాకతో.. ఇప్పటికే కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, దినేస్ కార్తీక్‌తో కూడిన బ్యాటింగ్ లైనప్‌కు గ్రీన్ సైతం జతకలవడంతో మరింత బలపడింది. అయితే.. ఈ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌కు మరో క్రీజీ స్టార్ బ్యాటర్ సైతం వచ్చి చేరుతున్నట్లు సమాచారం. అతనెవరో కాదు.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో సూపర్ బ్యాటింగ్‌తో దుమ్మురేపిన న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర.
భారత సంతతికి చెందిన ఈ కుర్రాడు వరల్డ్ కప్‌లో చిచ్చరపిడుగులా చెలరేగాడు. ఇండియాతో న్యూజిలాండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శన కనబర్చాడు. టోర్నీ మొత్తం మీద 10 మ్యాచ్‌లు ఆడిన రచిన్.. 578 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రచిన్ బ్యాటింగ్ స్టైల్‌కు, అగ్రెసివ్ ఇంటెంట్‌కు క్రికెట్ అభిమానులు ఫిదా అయిన విషయం తెలిసిందే. ఇతనేంటి ఇంత బాగా ఆడుతున్నాడు అంటూ భారత క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. దీంతో.. ఈసారి ఐపీఎల్‌లో రచిన్ రవీంద్రకు భారీ డిమాండ్ ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. అయితే.. ఐపీఎల్ 2024 కంటే ముందు మినీ వేలం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.
Teams have most purses for IPL 2024 auctions:
RCB – 40.75 Cr. 🔥
SRH – 34 Cr.
KKR – 32.7 Cr.
CSK – 31.4 Cr.Hope they buy Rachin Ravindra and Manish Pandey🤞❤️pic.twitter.com/lvViNnYECC
— Prajwal (@rockstar_praju_) November 26, 2023
ఆ వేలంలో రచిన్‌ను దక్కించుకునేందుకు ఇప్పటికే పలు ఫ్రాంచైజ్‌లు కన్నేశాయి. కానీ, అందరి కంటే ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ రేసులో ముందున్నట్లు సమాచారం. ఇప్పటికే రచిన్‌తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తుంది. పైగా రచిన్ రవీంద్ర కుటుంబ మూలాలు కూడా బెంగళూరులోనే ఉండటంతో.. ఆ టీమ్‌కు ఆడితే తన హోం టీమ్‌కు ఆడిన ఫీలింగ్ వస్తుందని కూడా రచిన్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ సెంటిమెంట్‌తోనే రచిన్.. ఆర్సీబీ తరఫున ఆడేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. మరి రచిన్ రవీంద్ర కోహ్లీతో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.