iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ హీరో.. రచిన్ రవీంద్రకు షాక్! ఇది ఊహించి ఉండరు!

  • Author Soma Sekhar Published - 02:39 PM, Tue - 28 November 23

వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ టీమ్ సెమీఫైనల్స్ వరకు వచ్చిందంటే దానికి కారణం రచిన్ రవీంద్ర. ఇక ఈ ప్రపంచ కప్ లో రచిన్ పేరు మారుమ్రోగిపోయింది. అలాంటి స్టార్ ప్లేయర్ కు ఊహించని షాక్ తగిలింది.

వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ టీమ్ సెమీఫైనల్స్ వరకు వచ్చిందంటే దానికి కారణం రచిన్ రవీంద్ర. ఇక ఈ ప్రపంచ కప్ లో రచిన్ పేరు మారుమ్రోగిపోయింది. అలాంటి స్టార్ ప్లేయర్ కు ఊహించని షాక్ తగిలింది.

  • Author Soma Sekhar Published - 02:39 PM, Tue - 28 November 23
వరల్డ్ కప్ హీరో.. రచిన్ రవీంద్రకు షాక్! ఇది ఊహించి ఉండరు!

రచిన్ రవీంద్ర.. భారతీయ మూలాలు ఉన్న ఈ న్యూజిలాండ్ ఆటగాడు వరల్డ్ కప్ లో అదరగొట్టాడు. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్ట్ లో నాలుగో ప్లేస్ లో నిలిచాడు. రచిన్ 10 మ్యాచ్ ల్లో 3 శతకాలు, 2 అర్దశతకాల సాయంతో 578 రన్స్ చేశాడు. ఇక ఈ ప్రపంచ కప్ లో రచిన్ పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఇతడిని వచ్చే ఐపీఎల్ సీజన్ ల్లో దక్కించుకోనేందుకు చాలా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రచిన్ కు ఊహించని షాక్ తగిలింది. బహుశా ఇలా జరుగుతుందని సగటు క్రికెట్ అభిమాని కూడా అనుకొని ఉండడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ టీమ్ సెమీఫైనల్స్ వరకు వచ్చిందంటే దానికి కారణం రచిన్ రవీంద్ర. తన అద్భుతమైన ఆటతీరుతో ఈ మెగాటోర్నీలో పరుగుల వరద పారించాడు. 10 మ్యాచ్ ల్లో 578 రన్స్ చేశాడు. అందులో మూడు రికార్డు సెంచరీలు ఉండటం విశేషం. ఇక అతడి సూపర్ ఫామ్ చూసి అందరూ కివీస్ జట్టులో ప్లేస్ కన్ఫామ్ అనుకున్నారు. కానీ.. ఊహించని రీతిలో అతడికి షాక్ తగిలింది. రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో ఈ రోజు(నవంబర్ 28)న ప్రారంభం అయిన తొలి టెస్ట్ మ్యాచ్ కు రచిన్ రవీంద్రను ఎంపిక చేయలేదు. భీకర ఫామ్ లో ఉన్నప్పటికీ.. కివీస్ మేనేజ్ మెంట్ అతడిని పక్కకు పెట్టింది. ఈ న్యూస్ క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

కాగా.. ఇటు ఓపెనర్ బ్యాటర్ గా అటు నాణ్యమైన స్పిన్నర్ గా రాణించే సత్తా గల ఆటగాడు రచిన్. అలాంటి ప్లేయర్ ను న్యూజిలాండ్ టీమ్ ఎలా పక్కన పెట్టిందో తెలియలేదు. ఇక చాలా కాలం తర్వాత టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కేన్ విలియమ్సన్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బంగ్లా బ్యాటింగ్ కు దిగింది. ప్రస్తుతానికి 60 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ 86 పరుగులు చేసి రాణించాడు. మిగతా వారిలో కెప్టెన్ షాంటో(37), మోమినుల్ హక్(37) రన్స్ చేశారు. మరి వరల్డ్ కప్ హీరో రచిన్ కు జట్టులో చోటు దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.