World Cup 2023: డికాక్‌ సునామీ ఇన్నింగ్స్‌! టీమిండియా మాజీ కోచ్‌ రికార్డ్‌ పదిలం

  • Author Soma Sekhar Published - 06:00 PM, Tue - 24 October 23

సూపర్ ఫామ్ లో ఉన్న సఫారీ కీపర్ డికాక్ తాజాగా మరో భారీ శతకంతో చెలరేగాడు. మాస్ హిట్టింగ్ తో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

సూపర్ ఫామ్ లో ఉన్న సఫారీ కీపర్ డికాక్ తాజాగా మరో భారీ శతకంతో చెలరేగాడు. మాస్ హిట్టింగ్ తో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

  • Author Soma Sekhar Published - 06:00 PM, Tue - 24 October 23

వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా బ్యాటర్ డికాక్ జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు సెంచరీలు చేసి.. సూపర్ ఫామ్ లో ఉన్న సఫారీ కీపర్ తాజాగా మరో భారీ శతకంతో చెలరేగాడు. మాస్ హిట్టింగ్ తో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఫోర్లు, సిక్సర్లతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 174 పరుగులు చేసి ద్విశతక అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అయితే టీమిండియా మాజీ కోచ్ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయాడు. అయితే డికాక్ క్రీజ్ లో ఉంటే కచ్చితంగా ద్విశతకం బాదేవాడే. అందులో ఎలాంటి సందేహం లేదు.
వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా బంగ్లాదేశ్-సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. నెదర్లాండ్స్ పై ఓటమి కసిని.. బంగ్లాపై తీర్చుకుంటోంది సఫారీ టీమ్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు భారీ స్కోర్ అందించాడు స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్. బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ.. భారీ శతకాన్ని నమోదు చేశాడు డికాక్. ఇక ఈ మ్యాచ్ లో మెుత్తం 140 బంతులు ఎదుర్కొన్న డికాక్ 15 ఫోర్లు, 7 సిక్స్ లతో 174 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించడం ద్వారా డికాక్ పలు రికార్డులు బ్రేక్ చేశాడు.
ఈ క్రమంలో వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన వికెట్ కీపర్ గా 48 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేశాడు డికాక్. కానీ టీమిండియా మాజీ కోచ్, సౌతాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ క్రిస్టన్ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయాడు.  క్రిస్టన్ 1996 వరల్డ్ కప్ లో యూఏఈపై 188 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా తరపున ఇదే అత్యధిక స్కోర్. కాగా.. టీమిండియాకు 2011 వరల్డ్ కప్ అందించిన జట్టుకు గ్యారీ క్రిస్టన్ కోచ్ గా ఉండటం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. డికాక్(174), మార్క్రమ్(60), క్లాసెన్(90) పరుగులతో రాణించారు.
Show comments