iDreamPost
android-app
ios-app

వీడియో: ఆడియెన్స్​తో గొడవకు దిగిన పాక్ క్రికెటర్.. కోపంతో ఊగిపోతూ..!

  • Published Mar 12, 2024 | 8:15 PM Updated Updated Mar 12, 2024 | 8:15 PM

ఒక పాకిస్థాన్ క్రికెటర్ ప్రేక్షకులతో గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయాడు. ఇదేనా సంస్కారం అంటూ వారి మీద సీరియస్ అయ్యాడు.

ఒక పాకిస్థాన్ క్రికెటర్ ప్రేక్షకులతో గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయాడు. ఇదేనా సంస్కారం అంటూ వారి మీద సీరియస్ అయ్యాడు.

  • Published Mar 12, 2024 | 8:15 PMUpdated Mar 12, 2024 | 8:15 PM
వీడియో: ఆడియెన్స్​తో గొడవకు దిగిన పాక్ క్రికెటర్.. కోపంతో ఊగిపోతూ..!

క్రికెటర్లను ఇష్టపడే వారు కోట్లలో ఉంటారు. అందులోనూ భారత ఉపఖండంలో ప్లేయర్లకు ఇచ్చే గౌరవం, వారిపై చూపించే ప్రేమ, ఆదరాభిమానాలను మాటల్లో చెప్పలేం. ఇండియాతో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్​లో క్రికెట్ అంటే పడిచచ్చే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఆటగాళ్లను డెమీ గాడ్స్​గా చూడటం ఇక్కడ సంప్రదాయంగా మారింది. అయితే క్రికెటర్లను వాళ్ల ఆటతీరును ఎంత ఇష్టపడతారో.. వాళ్లు ఏదైనా చేయరాని పని చేస్తే అంతే స్థాయిలో ద్వేషించడం, విమర్శించడం కూడా సర్వసాధారణమే. అలా ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాడో పాకిస్థాన్ క్రికెటర్. ఫిక్సర్.. ఫిక్సర్ అంటూ అందరూ అతడ్ని గేలి చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు ఆడియెన్స్​తో గొడవకు దిగాడు. ఇది పాకిస్థాన్ సూపర్​ లీగ్​లో చోటుచేసుకుంది.

పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ ఆడియెన్స్​తో ఫైట్​కు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది పీఎస్​ఎల్-2024లో చోటుచేసుకుంది. మ్యాచ్ ఆడేందుకు గ్రౌండ్​లోకి వస్తున్న ఆమిర్​ను కొందరు ప్రేక్షకులు గేలి చేశారు. ఫిక్సర్.. ఫిక్సర్ అంటూ అతడ్ని రెచ్చగొట్టారు. దీంతో పట్టరాని కోపంతో ఊగిపోయాడు ఆమిర్. తననే అంటారా అంటూ సీరియస్ అయ్యాడు. మీరు నేర్చుకున్న సంస్కారం ఇదేనా అంటూ ఆడియెన్స్​ను ప్రశ్నించాడు. ఆమిర్ అసహనానికి గురవడం, ఆడియెన్స్​ మీద సీరియస్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమిర్​ను ఫిక్సర్ అంటూ గేలి చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

మరికొందరు నెటిజన్స్ మాత్రం ఆమిర్ మీద సీరియస్ అవుతున్నారు. అతడు ఫిక్సింగ్ చేశాడు కాబట్టి అలా అంటున్నారని.. ఎలాంటి కామెంట్స్ చేసినా ఓపిక పట్టి పెర్ఫార్మెన్స్​తో అందరి మనసులు గెలుచుకోవాలని చెబుతున్నారు. ఇక, 2010లో పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్​లో పర్యటించిన సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం సంచలనం రేపింది. ఆ సిరీస్​లోని ఓ టెస్ట్ మ్యాచ్​లో కావాలనే వరుసగా రెండు నోబాల్స్ వేశాడు ఆమిర్. స్పాట్ ఫిక్సింగ్​కు అతడు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో 5 ఏళ్ల పాటు బ్యాన్​ను ఎదుర్కొన్నాడు ఆమిర్. 2015లో రీఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్.. 2020లో క్రికెట్​లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఫ్రాంచైజీ లీగ్స్ ఆడుతూ గడిపేస్తున్న ఆమిర్​ను ఇంకా ఫిక్సింగ్ మరకలు మాత్రం వీడటం లేదు. మరి.. ప్రేక్షకులతో ఆమిర్ గొడవపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ​