iDreamPost
android-app
ios-app

బాబర్ విధ్వంసకర సెంచరీ.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్ గా రికార్డు!

  • Published Feb 27, 2024 | 9:49 AM Updated Updated Feb 27, 2024 | 9:49 AM

Babar Azam Century: పాకిస్తాన్ సూపర్ లీగ్ లో రెచ్చిపోయి ఆడుతున్నాడు బాబర్ అజామ్. తాజాగా ఇస్లామాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా రికార్డు సెంచరీతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా నిలిచాడు.

Babar Azam Century: పాకిస్తాన్ సూపర్ లీగ్ లో రెచ్చిపోయి ఆడుతున్నాడు బాబర్ అజామ్. తాజాగా ఇస్లామాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా రికార్డు సెంచరీతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా నిలిచాడు.

బాబర్ విధ్వంసకర సెంచరీ.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్ గా రికార్డు!

బాబర్ అజామ్.. ప్రపంచ క్రికెట్ లో చిన్న చూపు చూసే ప్లేయర్ గా నిలిచిపోయాడు. అయితే అతడు అప్పుడప్పుడు మాట్లాడే మాటలు ఇందుకు కారణం కావొచ్చు. బాబర్ వ్యక్తిత్వం ఎలాంటిదైనప్పటికీ.. అతడి ఆటను మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే. తనపై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా.. బ్యాట్ తో తనపని తాను చేసుకుంటూ ముందుకుసాగుతున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని రికార్డులను సైతం తన పేరిట లిఖిస్తున్నాడు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.

ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ దుమ్మురేపే ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. మెున్నటి మ్యాచ్ లో 72 రన్స్ తో సత్తాచాటిన ఈ స్టార్ ప్లేయర్ తాజాగా ఇస్లామాబాద్ యూనైటెడ్ తో జరిగిన మ్యాచ్ లో విధ్వంసకర సెంచరీతో కదంతొక్కాడు. తొలుత బ్యాటింగ్ లో నెమ్మదిగా ఆడిన బాబర్.. ఆ తర్వాత గేర్ మార్చాడు. దీంతో అతడిలో ఈ కోణం కూడా ఉందని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. తొలి 42 బంతుల్లో 52 రన్స్ చేసిన అతడు.. ఆ తర్వాత ఫిఫ్టీని కేవలం 17 బాల్స్ లోనే కంప్లీట్ చేశాడు. 59 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 63 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీ20 ఫార్మాట్ లో ఇది బాబర్ కు 11 శతకం కావడం విశేషం. 284 మ్యాచ్ ల్లో బాబర్ ఈ రికార్డు సాధించాడు. ఈ క్రమంలో పొట్టి క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్ గా బాబర్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 3 సెంచరీలు, పీఎస్ఎల్ లో రెండు.. మిగిలినవి ఇతర లీగుల్లో చేశాడు.

ఇక టీ20ల్లో ఎక్కువ శతకాలు బాదిన రికార్డు వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అతడు 463 మ్యాచ్ ల్లో 22 సెంచరీలు బాదాడు. దీంతో స్టార్ ప్లేయర్లు సైతం సాధించలేని ఘనతను ఈ పాక్ మాజీ కెప్టెన్ తన పేరిట లిఖించుకోవడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ టీమ్ పోరాడి ఓడిపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసి 8 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇస్లామాబాద్ టీమ్ లో కొలిన్ మన్రో 71, అజాం ఖాన్ 75 పరుగులతో రాణించారు. మరి బాబర్ సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: సెలెక్టర్లపై కోపం.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్!