iDreamPost

సెలెక్టర్లపై కోపం.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్!

సెలెక్టర్లపై కోపంతో 12 ఏళ్ళ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు ఓ స్టార్ పేసర్. మరి ఆ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సెలెక్టర్లపై కోపంతో 12 ఏళ్ళ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు ఓ స్టార్ పేసర్. మరి ఆ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సెలెక్టర్లపై కోపం.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్!

సాధారణంగా క్రికెటర్లు ఓ ఏజ్ అంటూ వచ్చాక తమ సుదీర్ఘమైన కెరీర్ కు వీడ్కోలు పలుకుతూ ఉంటారు. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం జట్టులో ప్లేస్ కోసం చూసి.. చూసి.. ఓపిక నశించి రిటైర్మెంట్ ఇస్తారు. ఇంకొందరు ప్లేయర్లు ఓ సిరీస్ లో చోటు దక్కదని తెలిస్తే.. వెంటనే ఆటకు గుడ్ బై చెబుతూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ క్రికెటర్ ఇదే పనిచేశాడు. సెలెక్టర్లపై కోపంతో తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూజిలాండ్ వెటరన్ పేసర్ నీల్ వాగ్నర్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు తీసుకున్న సంచలన నిర్ణయంతో కివీస్ ఫ్యాన్స్ షాక్ కు గురైయ్యారు. అయితే అతడు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఓ విషయం దాగున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఫిబ్రవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ జరగనున్నది. ఈ సిరీస్ కు అతడిని జట్టులోకి తీసుకోవట్లేదని సెలెక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపానికి గురై.. కోపంతో వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు వాగ్నర్. ఈ సిరీస్ తర్వాత గుడ్ బై చెబుదామనుకున్న నీల్ కు కివీస్ బోర్డు షాకిచ్చింది. అయితే సెలెక్టర్లు అతడిని టీమ్ లోకి తీసుకుంటారో? లేదో? చూడాలి.

తన రిటైర్మెంట్ గురించి వాగ్నర్ మాట్లాడుతూ..”నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిథ్యం వహించడ నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. కివీస్ తరఫున క్రికెట్ ఆడిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. ఈ 12 ఏళ్ల జర్నీలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. కొత్త ప్లేయర్లు అవకాశం ఇచ్చే టైమ్ వచ్చింది” అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. 2012లో కివీస్ తరఫున టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన వాగ్నర్.. తన బౌన్సీ బౌలింగ్ తో ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు తన కెరీర్ లో 64 టెస్టులు ఆడి.. 260 వికెట్లు పడగొట్టాడు. వన్డే, టీ20 ఫార్మాట్ లో కివీస్ కు ప్రాతినిథ్యం వహించలేదు ఈ వెటరన్ పేసర్.

ఇదికూడా చదవండి: ఇంగ్లండ్ పై సిరీస్ విజయం.. ద్రవిడ్ ను ఎప్పుడూ ఇలా చూసుండరు! వీడియో వైరల్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి