“వెస్టిండీస్ టూర్ కు నన్ను ఎంపిక చేయలేదు. దాంతో నేను అసంతృప్తికి గురైయ్యాను. అయితే పరిస్థితులను అంగీకరించి ముందుకెళ్లడం తప్ప నేను చేసేది ఏమీ లేదు. పైగా నేను ఎవ్వరితోనూ పోరాడలేను ” అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదన వ్యక్తం చేశాడు టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోవడంతో.. జట్టులో స్థానాన్ని సైతం కోల్పోయాడు ఈ డాషింగ్ బ్యాటర్. దాంతో మనసికంగా కుంగుబాటుకు లోనవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే క్రికెట్ కెరీర్ లో తన లక్ష్యం ఏంటో చెప్పుకొచ్చాడు. టీమిండియాకు వరల్డ్ కప్ అందించడమే నా డ్రీమ్ అంటూ పృథ్వీ షా పేర్కొన్నాడు.
పృథ్వీ షా.. అండర్-19 వరల్డ్ కప్ గెలిచి కెరీర్ స్టార్టింగ్ లో మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. అతడి ఆటతీరు చూసి జూనియర్ సెహ్వాగ్ అంటూ అందరు ప్రశంసలతో ముంచెత్తారు. అయితే అతడికి అవకాశాలు వచ్చినా గానీ.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో.. విఫలం అయ్యాడు షా. దాంతో టీమిండియాలో చోటు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. గత రెండేళ్లుగా పూర్ ఫామ్ తో సతమతమవుతున్నాడు. దాంతో తీవ్ర మానసిక కుంగుబాటుకు లోనౌతున్నాడు పృథ్వీ షా. దీనికి తోడు ఇటీవలే మోడల్ సప్నా గిల్ వ్యవహరం కూడా అతడిని మానసికంగా దెబ్బతీసింది.
ఈ నేపథ్యంలో తన మనసులో మాటను బయటపెట్టాడు పృథ్వీ షా. తన కెరీర్ లో టీమిండియా కు వరల్డ్ కప్ అందించడమే నా లక్ష్యం అని, దానితో పాటుగా భారతదేశానికి 12 నుంచి 14 సంవత్సరాలు ఆడటమే నా ధ్యేయం అని చెప్పుకొచ్చాడు. కాగా.. షాకి టాలెంట్ ఉన్నప్పటికీ దానిని వాడుకోవడంలో అతడు విఫలం అవుతున్నాడు. దాంతో జట్టులో చోటు కూడా కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ కు షాని సెలక్ట్ చేస్తారని అందరు భావించారు. కానీ ఈ టూర్ కు కూడా అతడికి మెుండిచేయే చూపించారు సెలక్టర్లు. దాంతో తీవ్ర మానసిక వేదనకు గురౌతున్నాడు ఈ ఢిల్లీ డాషింగ్ బ్యాటర్. మరి టీమిండియాకు వరల్డ్ కప్ అందించడమే నా డ్రీమ్ అన్న పృథ్వీ షా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Prithivi Shaw on his Future Goals. (Source:- Cricbuzz) pic.twitter.com/GfKoFQmPDo
— CricketGully (@thecricketgully) July 19, 2023
ఇదికూడా చదవండి: ఈ వీడియో చూస్తే సచిన్ ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్ గ్యారంటీ!