iDreamPost
android-app
ios-app

ఈ వీడియో చూస్తే సచిన్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్‌ గ్యారంటీ!

  • Published Jul 19, 2023 | 2:20 PM Updated Updated Jul 19, 2023 | 2:20 PM
  • Published Jul 19, 2023 | 2:20 PMUpdated Jul 19, 2023 | 2:20 PM
ఈ వీడియో చూస్తే సచిన్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్‌ గ్యారంటీ!

సచిన్‌ టెండూల్కర్‌.. ఇండియన్‌ క్రికెట్‌కి అతనే దేవుడు. ఒక ఆటగాడు.. ఆ ఆటనే గాడ్‌లా ఎదిగాడంటే ఎంత సాధించి ఉంటాడో కదా. ఎస్‌.. సచిన్‌ ఎంతో సాధించాడు. భవిష్యత్తులో ఇండియన్‌ క్రికెట్‌ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే.. సగం కంటే ఎక్కువ సచిన్‌ గురించే ఉంటుంది. అంతా సచిన్‌ తన ముద్రను భారత క్రికెట్‌పై వేశాడు. ఒకటా రెండా.. ఎన్నో గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాకు ఒంటి చేత్తో విజయాలు అందించాడు. సచిన్‌ను ఔట్‌ చేస్తే చాలు ఇండియాను ఓడించినట్లేనని ప్రత్యర్థి జట్లు భావించేవంటేనే అర్థం చేసుకోవచ్చు సచిన్‌ ఎలాంటి ఆటగాడో.. బౌలర్ల వేటగాడో.

ప్రపంచ క్రికెట్‌లో సచిన్‌ ఒక లివింగ్‌ లెజెండ్‌. అలాగే మరెంతో మంది గొప్ప బౌలర్ల కూడా ఉన్నారు. సచిన్‌ గురించి ప్రస్తుత యువతరానికి అంతగా తెలియకపోవచ్చు. సచిన్‌ ఆటను, బౌలర్లపై అతను చూపించిన డామినేషన్‌ను ఇప్పటి తరం యువ క్రికెట్‌ అభిమానులకు వివరించడం అంటే 100 కేజీఎఫ్‌ సినిమాల ఎలివేషన్స్‌ను ఒకే సినిమాలో చూపించడం లాంటిది. అది సచిన్‌ స్థాయి. అలాంటి ఆటగాడు కాబట్టే అతన్ని ఇండియన్‌ క్రికెట్‌కు గాడ్‌గా అభివర్ణిస్తారు.

ఇండియాతో పాటు ప్రపంచ క్రికెట్‌లో పెద్ద జట్లుగా పేరున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, పాకిస్థాన్ టీమ్స్‌పై సచిన్‌ చేసిన దండయాత్రను మనం మర్చిపోయినా ఆ జట్లు మర్చిపోలేవు. షేన్‌ వార్న్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, వసీం అక్రమ్‌, షోయబ్‌ అక్తర్‌లు తమ బౌలింగ్‌తో హేమాహేమీ బ్యాటర్లనే వణికించిన బౌలర్లు. అలాంటి వారికి చుక్కలు చూపిస్తూ.. నిద్రలో కూడా భయపెట్టిన ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు సచిన్‌ ఆటను చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎంతో అదృష్టవంతులని చాలా మంది సీనియర్‌ క్రికెట్‌ అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు.

అయితే.. సచిన్‌ ఆటను చూస్తూ పెరిగిన వారికి మరోసారి సచిన్‌ సూపర్‌ బ్యాటింగ్‌ను గుర్తు చేసేలా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తే సచిన్‌ ఫ్యాన్స్‌ పాత రోజుల్లోకి వెళ్లిపోతారు. అప్పట్లో సచిన్‌ సృష్టించిన విధ్వంస ఒక్కసారిగా కళ్ల ముందు గిర్రున తిరుగుతుంది. వీడియో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సచిన్‌ అభిమానులకు ఐఫీస్ట్‌ లాంటి వీడియో మీరూ చూసి, అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బంతితో పరిగెత్తిన బ్యాటర్.. వెంటపడ్డ కీపర్! వైరలవుతున్న వీడియో

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet