Preity Zinta: ‘పంజాబ్ కింగ్స్’లో లుకలుకలు.. కో-ఓనర్ పై ప్రీతీ జింటా లీగల్ యాక్షన్!

ప్రీతీ జింటా పంజాబ్ కో-ఓనర్ పై లీగల్ యాక్షన్ తీసుకున్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రీతీ జింటా పంజాబ్ కో-ఓనర్ పై లీగల్ యాక్షన్ తీసుకున్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పంజాబ్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయింది. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. తన టైటిల్ కల అలాగే ఉండిపోయింది. దాంతో జట్టులో మార్పులు చేర్పులు చేస్తూ వస్తోంది మేనేజ్ మెంట్. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇదిలా ఉండగా.. తాజాగా పంజాక్ కింగ్స్ మేనేజ్ మెంట్ లో విభేదాలు తలెత్తాయి అన్నది ప్రస్తుతం క్రీడా వర్గాల్లో జోరుగా నడుస్తోన్న చర్చ. ప్రీతీ జింటా పంజాబ్ కో-ఓనర్ పై లీగల్ యాక్షన్ తీసుకున్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పంజాబ్ కింగ్స్ మేనేజ్ మెంట్ లో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. యజమానుల మధ్య పొరపచ్చలు వచ్చాయని నేషనల్ మీడియాలో కథనాలు జోరుగా వెలువడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ కు బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, బిజినెస్ మెన్ లు మెహిత్ బర్మన్, నెస్ వాడియాలు ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. అయితే మోహిత్ బర్మన్ తన షేర్లను ప్రీతీ జింటా, నెస్ వాడియాలకు తెలియకుండా అమ్ముతున్నాడని, దాన్ని అడ్డుకోవాలని చండీగఢ్ హైకోర్ట్ ను ప్రీతీ జింటా ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి.

కాగా.. తాను పంజాబ్ కింగ్స్ షేర్లు అమ్ముతున్నట్లు తనపై వచ్చిన వార్తలపై స్పందించాడు మోహిత్ బర్మన్. తాను ఎలాంటి షేర్లను అమ్మడం లేదని స్పష్టం చేశాడు. ఇక ఈ విషయంపై పంజాబ్ సూపర్ కింగ్స్ ప్రతినిధులు ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా.. తమ వాటాను ఎవరైనా విక్రయించాలి అనుకుంటే ముందుగా పార్ట్ నర్స్ కు తెలియజేయాలి. వారు కొనలేం అన్న తరువాతే బహిరంగంగా అమ్మేందుకు సిద్ధపడాలి. కానీ మోహిత్ బర్మన్ అలా చేయడం లేదనే ప్రీతీ జింటా కోర్టును ఆశ్రయించినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై పంజాబ్ కింగ్స్ ఓనర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Show comments