iDreamPost
android-app
ios-app

అఫ్గానిస్తాన్ జట్టు సెమీస్ కు చేరే అవకాశం.. ఎలాగంటే?

వరల్డ్ కప్ 2023లో చాలా మ్యాచులు ఊహలకు భిన్నంగా జరుగుతున్నాయి. పసికూనలు అనుకున్న జట్లు చెలరేగి ఆడుతున్నాయి. టైటిల్ ఫేవరెట్లు మాత్రం చతికిలపడుతున్నారు. ఈ నేపథ్యంలోననే అసలు అఫ్గాన్ జట్టు సెమీస్ చేరేందుకు ఉన్న అవకాశాలు ఏంటో చూద్దాం.

వరల్డ్ కప్ 2023లో చాలా మ్యాచులు ఊహలకు భిన్నంగా జరుగుతున్నాయి. పసికూనలు అనుకున్న జట్లు చెలరేగి ఆడుతున్నాయి. టైటిల్ ఫేవరెట్లు మాత్రం చతికిలపడుతున్నారు. ఈ నేపథ్యంలోననే అసలు అఫ్గాన్ జట్టు సెమీస్ చేరేందుకు ఉన్న అవకాశాలు ఏంటో చూద్దాం.

అఫ్గానిస్తాన్ జట్టు సెమీస్ కు చేరే అవకాశం.. ఎలాగంటే?

వరల్డ్ కప్ 2023లో కొన్ని మ్యాచులయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఫలితాలు వస్తున్నాయి. పసికూన అనుకునే జట్లు జూలు విదిల్చి సింహాల్లా గర్జిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అఫ్గానిస్తాన్ జట్టు అయితే సంచలనాలను నెలకొల్పుతోంది. అంతేకాకుండా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్ లో సెమీస్ కు చేరి సరికొత్త చరిత్ర లిఖించాలనే తపనతో అఫ్గానిస్తాన్ జట్టు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐదోస్థానంలో ఉన్న అఫ్గాన్ జట్టు అసలు సెమీస్ చేరుతుందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే అందుకు ఆస్కారం లేకపోలేదు. ఏ విధంగా జరిగితే అఫ్గాన్ జట్టు సెమీస్ చేరుతుందో చూద్దాం.

వరల్డ్ కప్ 2023లో అఫ్గానిస్తాన్ జట్టు ఇచ్చిన షాకులు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటి వరకు అన్ని జట్లు ఆరేసి మ్యాచుల చొప్పున ఆడాయి. ఇప్పటివరకు అఫ్గానిస్తాన్ జట్టు పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల కంటే కూడా మెరుగైన స్థానంలో ఉంది. ఆడిన ఆరు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో విజయం సాధించి 6 పాయింట్లతో కొనసాగుతోంది. టీమిండియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ చేతిలో మాత్రమే అఫ్గాన్ జట్టు పరాజయం పాలైంది. ఒకప్పుడు ఛాంపియన్ గా నిలిచిన ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లకు అఫ్గాన్ టీమ్ గట్టి షాకే ఇచ్చింది. అందుకే ఇప్పుడు వరల్డ్ కప్ లో చాలా మందికి అఫ్గాన్ జట్టు ఫేవరెట్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్ జట్టు సెమీస్ కూడా చేరాలంటూ కోరుకుంటున్నారు.

అఫ్గానిస్తాన్ జట్టు సెమీస్ చేరాలి అంటే.. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లతో జరగాల్సిన మ్యాచుల్లో అఫ్గాన్ భారీ తేడాతో విజయం సాధించాలి. అలా జరిగితే ఆస్ట్రేలియా ఆడాల్సిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలు నమోదు చేసినా కూడా.. అఫ్గాన్ కు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రెండు జట్లు 12 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు మెరుగన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది.    ఆడాల్సి ఉన్న మూడు మ్యాచుల్లో ఒక దాంట్లో ఓడినా కూడా అఫ్గాన్ జట్టుకు సెమీస్ చేరేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే అలా జరగాలి అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లలో ఒకటి ఆడాల్సి ఉన్న 3 మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.

అలాంటప్పుడు మూడు జట్లు 10 పాయింట్లతో కొనసాగుతాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు సెమీస్ కు చేరుతుంది. అఫ్గానిస్తాన్ జట్టుకు ఇంకో ఛాన్స్ కూడా ఉంది. 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు.. ఆడాల్సి ఉన్న మిగిలిన మూడు మ్యాచుల్లో ఓడిపోతే అఫ్గాన్ జట్టు సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఒకవేళ అఫ్గానిస్తాన్ జట్టు సెమీస్ చేరితే అది చరిత్రే అవుతుంది. అయితే ఇవన్నీ జరగాలి అంటే అఫ్గాన్ జట్టు స్వయంకృషి మాత్రమే కాదు.. కొంత లక్ కూడా కలిసి రావాలి. అయితే క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి అఫ్గాన్ జట్టు సెమీస్ చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పైగా ఆ జట్టు ఇప్పుడు క్రికెట్ లవర్స్ వరల్డ్ కప్ ఫేవరెట్ లిస్టులో కూడా ఉంది. మరి.. అఫ్గానిస్తాన్ జట్టు సెమీస్ చేరుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి