SNP
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్.. చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చి మనసు విప్పి మాట్లాడాడు. సచిన్-కోహ్లీ గురించి ఎదురైన ఒక ప్రశ్నకు.. ఊహించని సమాధానం ఇచ్చి ఔరా అనిపించాడు. మరి ప్రవీణ్ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్.. చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చి మనసు విప్పి మాట్లాడాడు. సచిన్-కోహ్లీ గురించి ఎదురైన ఒక ప్రశ్నకు.. ఊహించని సమాధానం ఇచ్చి ఔరా అనిపించాడు. మరి ప్రవీణ్ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు. ఇండియన్ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు తమ ఆటతో ఎంతో సేవ చేశారు. అయితే.. సచిన్‌తో కోహ్లీని పోల్చడమనేది సర్వసాధారణం అయిపోయింది. సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను కోహ్లీ బద్దలుకొడుతూ వస్తున్నాడు. దీంతో.. ఎవరు బెస్ట్ క్రికెటర్ అనే చర్చ కొనసాగుతూనే ఉంది. క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, దిగ్గజ ఆటగాళ్లు సైతం ఏదో ఒక సందర్భంలో సచిన్-కోహ్లీలో ఎవరు గొప్ప అనే ప్రశ్నను ఎదుర్కొని ఉంటారు. చాలా మంది తమ అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు చెబితే.. మరి కొందరూ.. వాళ్లిద్దరిని కంప్యార్ చేయడం సరికాదని పేర్కొనేవారు. ఇప్పుడు ఇదే ప్రశ్న.. టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్‌కు ఎదురైంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత ప్రవీణ్ కుమార్ తొలిసారి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో ఓ క్రికెట్ అభిమాని.. ప్రవీణ్ ముందు సచిన్-కోహ్లీలో ఎవరు బెస్ట్? సచిన్ ఎదుర్కొన్న బౌలర్లను కోహ్లీ ఎదుర్కొలేదు అని కొంతమంది అంటారు దాన్ని మీరు ఎలా చూస్తారని ప్రశ్నించగా.. ప్రవీణ్ కుమార్ మంచి సమాధానం ఇచ్చాడు. సచిన్-కోహ్లీ ఆడినవి రెండు వేర్వేరు సందర్భాలని.. సచిన్ ఎంతో మంది గొప్ప, టఫ్ బౌలర్లను ఎదుర్కొన్నారని.. ఆయన సమయంలో వన్డేల్లో పరుగులు చేయడం అంత సులువైన విషయం కాదని పేర్కొన్నాడు.
అలాగే కోహ్లీ కూడా గొప్ప ఆటగాడని.. ప్రస్తుతం క్రికెట్‌లో వన్డేల్లో రెండు కొత్త బంతులను వినియోగిస్తున్నారని.. ఇది కూడా అంత ఈజీ కాదని, ఇద్దరు వారి వారి టైమ్‌లో గొప్ప ఆటగాళ్లని.. వాళ్లిద్దరిలో ఎవరు గొప్ప అంటే.. నాకైతే ఇద్దరు గొప్పే అని ప్రవీణ్ కుమార్ తెలిపాడు. ప్రవీణ్ కుమార్ ఇచ్చిన సమాధానంతో ఆ కార్యక్రమంలో చప్పట్ల మోతమోగిపోయింది. ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడైతే.. కోహ్లీ కింగ్. ఇద్దరు గొప్ప ఆటగాళ్లే.. పైగా ఇద్దరు ఇండియాలోనే పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అంటూ ఆ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరి సచిన్-కోహ్లీలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు ప్రవీణ్ ఇచ్చిన సమాధానంపై అలాగే వారిద్దరిలో ఎవరు గొప్ప అని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.