Nidhan
Rohit Sharma, Pragyan Ojha, Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇతర ప్లేయర్లలా వెకేషన్స్‌లో గడిపేయకుండా ఫిట్‌నెస్‌పై అతడు ఫోకస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ బడా ప్లాన్ వేస్తున్నాడని అన్నాడు.
Rohit Sharma, Pragyan Ojha, Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇతర ప్లేయర్లలా వెకేషన్స్‌లో గడిపేయకుండా ఫిట్‌నెస్‌పై అతడు ఫోకస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ బడా ప్లాన్ వేస్తున్నాడని అన్నాడు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఇంటి వద్దే ఉంటున్నాడు. బంగ్లాదేశ్ సిరీస్‌కు ముందు భారీ గ్యాప్ దొరకడంతో ఫ్యామిలితో కలసి ఇంట్లోనే గడుపుతున్నాడు. అలాగని అతడు ఖాళీగా ఉండటం లేదు. ఇతర ప్లేయర్లలా వెకేషన్స్‌లో గడిపేయకుండా ఫిట్‌నెస్‌పై హిట్‌మ్యాన్ ఫోకస్ చేస్తున్నాడు. షూస్ వేసుకొని రోహిత్ రన్నింగ్ చేస్తున్న ఫొటోలు, అలాగే ట్రెయింగ్ చేస్తున్న వీడియోలు రీసెంట్గా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఆ తర్వాత వచ్చిన ఇంకొన్ని ఫొటోల్లో అతడ్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. బొద్దుగా, ముద్దుగా ఉండే టీమిండియా కెప్టెన్ ఆ ఫొటోల్లో పొట్ట తగ్గించి ఫిట్‌గా కనిపించాడు. దీంతో సడన్‌గా హిట్‌మ్యాన్ ఎందుకు బరువు తగ్గాడని అంతా డిస్కస్ చేస్తున్నారు. దీని మీద భారత మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా రియాక్ట్ అయ్యాడు. రోహిత్ ఫిట్‌గా మారడం వెనుక బడా ప్లాన్ ఉందన్నాడు. అది తెలిస్తే అంతా షాక్ అవుతారని చెప్పాడు.
రోహిత్ తన కెరీర్‌ను మరింత కాలం పొడిగించుకోవడంపై ఫోకస్ చేశాడని.. ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనలు అతడికి లేవన్నాడు ఓజా. ఎక్కువ కాలం గేమ్‌లో కంటిన్యూ అవ్వాలంటే ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యమనే విషయం అతడు గుర్తించాడని.. అందుకే బంగ్లాదేశ్ సిరీస్‌కు ముందు దొరికిన గ్యాప్‌ను ఫిట్‌గా మారడానికి యూజ్ చేసుకుంటున్నాడని చెప్పాడు ఓజా. ‘రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు నేను కూడా చూశా. తన కెరీర్‌ను పొడిగించుకోవాలంటే ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. అన్నింటి కంటే ఫిట్నెస్ చాలా ముఖ్యమనే విషయాన్ని రోహిత్ అర్థం చేసుకున్నాడు. అందుకే దొరికిన ఈ 48 రోజుల గ్యాప్‌ను అతడు ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడం కోసం వాడుకుంటున్నాడు. బాగా ట్రెయిన్ అయి ఫిట్‌గా, రెడీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు’ అని ఓజా చెప్పుకొచ్చాడు. ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్‌కు టీమిండియా అంటే చాలా ఇష్టమని.. జట్టులోని ఆటగాళ్లను అతడు ఫ్యామిలీలా చూసుకుంటాడని తెలిపాడు ఓజా. ప్రతి ప్లేయర్ విషయంలో కేర్ తీసుకుంటాడన్నాడు. అతడు అందరితో అలా ఉంటాడు కాబట్టే టీమ్ మొత్తం అతడ్ని నమ్ముతోందని, ఆ నమ్మకమే అద్భుతాలు చేసి చూపిస్తోందన్నాడు ఓజా. ఇక, ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్.. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేల నుంచి కూడా తప్పుకునే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. అయితే లాంగ్ ఫార్మాట్లో మాత్రం వచ్చే కొన్నేళ్ల పాటు అతడు కంటిన్యూ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఓజా చేసిన వ్యాఖ్యలతో వన్డేలు, టెస్టుల్లో వచ్చే కొన్నేళ్ల పాటు హిట్‌మ్యాన్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే టీమిండియాకు చాలా మంచిది. జూనియర్లు టీమ్‌లో సెటిల్ అయ్యే వరకు హిట్‌మ్యాన్, కోహ్లీ లాంటి సీనియర్లు ఉండటం జట్టుకు ఎంతో అవసరమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
🚨INSIDESPORT EXCLUSIVE🚨
“Rohit Sharma knows fitness is the top most important thing if he wants to prolong his career”
“The way Rohit is handling Team India is like he is handling his own family”
– Pragyan Ojha#cricket #rohitsharma #viratkohli #viral pic.twitter.com/fNBYtha3RX
— InsideSport (@InsideSportIND) September 4, 2024