iDreamPost
android-app
ios-app

ఫొటో సెంటిమెంట్‌! ఫైనల్లో టీమిండియాదే విజయం

  • Published Nov 18, 2023 | 5:24 PMUpdated Nov 18, 2023 | 5:43 PM

విశ్వవిజేతగా నిలిచేందుకు ప్రపంచంలోనే రెండు బెస్ట్‌ టీమ్స్‌ ఆదివారం తుదిపోరుకు సిద్దం అవుతున్నాయి. అయితే.. ఈ మెగా ఫైనల్‌కు ముందు.. ఓ క్రేజీ సెంటిమెంట్‌ టీమిండియా క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే బూస్ట్‌ అప్‌ ఇస్తోంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

విశ్వవిజేతగా నిలిచేందుకు ప్రపంచంలోనే రెండు బెస్ట్‌ టీమ్స్‌ ఆదివారం తుదిపోరుకు సిద్దం అవుతున్నాయి. అయితే.. ఈ మెగా ఫైనల్‌కు ముందు.. ఓ క్రేజీ సెంటిమెంట్‌ టీమిండియా క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే బూస్ట్‌ అప్‌ ఇస్తోంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 18, 2023 | 5:24 PMUpdated Nov 18, 2023 | 5:43 PM
ఫొటో సెంటిమెంట్‌! ఫైనల్లో టీమిండియాదే విజయం

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానుల ఫోకస్‌ మొత్తం ఆదివారం జరగబోయే వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌పైనే ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్‌ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య తుది పోరు జరగనుంది. ఇప్పటికై ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్‌.. ఆరో టైటిల్‌ కోసం పోటీ పడుతోంది. మరోవైపు రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచిన భారత్‌.. ముచ్చటగా మూడో సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లు ఊరుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే 2003లో ఓ సారి వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో కంగారులు.. గంగూలీ సేనపై విజయం సాధించారు. కానీ, ఈ సారి అలాంటి సీన్‌ లేదని.. కప్పు టీమిండియాదే భారత క్రికెట్‌ అభిమానులు గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఎందుకంటే ఈ సారి భారత జట్టు అంత పటిష్టంగా ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పటికే టీమిండియా వరల్డ్‌ ఛాంపియన్‌ అనుకోవాలి. ఎందుకంటే.. ప్రపంచంలోని మేటి జట్లను వరుసపెట్టి ఈ టోర్నీలోనే ఓడించింది. టాప్‌ 10 టీమ్స్‌లో భారత జట్టు ఓడించని ప్రత్యర్థిలేదు. న్యూజిలాండ్‌ జట్టునైతే ఇదే టోర్నీలో రెండు సార్లు ఓడించింది. ఇక ఇప్పుడు మనతో ఫైనల్‌కు సిద్ధమవుతున్న ఆస్ట్రేలియాను సైతం టీమిండియా ఎప్పుడో టోర్నీ ఆరంభంలో తొలి మ్యాచ్‌లోనే ఓడించింది. ఆసీస్‌పై విజయంతో వరల్డ్‌ కప్‌ వేటను మొదలుపెట్టిన రోహిత్‌ సేన.. వరుసబెట్టి తొమ్మిది విజయాలతో సెమీస్‌ చేరింది. సెమీస్‌లోనే అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకొచ్చింది.

టీమిండియా.. ఏ జట్టుపై అయితే గెలుపుతో వరల్డ్‌ కప్‌ వేటను మొదలుపెట్టిందో.. తిరిగి అదే జట్టుపై గెలిస్తే వరల్డ్‌ కప్‌ వేట విజయపథంగా ముగుస్తుంది. ఈ క్రమంలో టీమిండియాకు ఓ క్రేజీ సెంటిమెంట్‌ కూడా అనుకూలంగా ఉంది. అదేంటంటే.. ఆదివారం ఫైనల్‌ కంటే ముందు శనివారం భారత్‌, ఆసీస్‌ కెప్టెన్లు వరల్డ్‌ కప్‌తో ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. ప్రపంచ కప్‌తో ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే.. ఇక్కడే టీమిండియా ఫ్యాన్స్‌ను ఓ విషయం సంతోష పెడుతోంది. అదేంటంటే.. ఈ ఫొటో షూట్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కప్పుకు ఎడమవైపు నిలబడటమే. 2011 నుంచి వరల్డ్‌ కప్‌తో ఫైనలిస్ట్‌లు చేసే ఫొటో షూట్‌లో లెఫ్ట్‌ సైడ్‌లో ఉన్న కెప్టెనే కప్పు ఎత్తుతున్నాడు. 2011లో ధోని, 2015లో క్లార్క్‌, 2019లో ఇయాన్‌ మోర్గాన్‌.. ఇప్పుడు రోహిత్‌ శర్మ కప్పుకు లెఫ్ట్‌ సైడ్‌ నిలబడ్డారు. సో.. రేపు జరగబోయే ఫైనల్లో టీమిండియానే విజయం సాధిస్తుందని క్రికెట్‌ అభిమానులు ఈ సెంటిమెంట్‌ ఆధారంగా ఆశలు పెంచుకుంటున్నారు. మరి ఈ సెంటిమెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి