iDreamPost
android-app
ios-app

ఫిలిప్ హ్యూస్.. గ్రౌండ్​లోనే చనిపోయిన ఓ క్రికెటర్ కథ! నేటికి 9 ఏళ్లు!

  • Author singhj Published - 04:17 PM, Mon - 27 November 23

క్రికెట్​లో అతడే నెక్స్ట్ సూపర్ స్టార్ అని అంతా అనుకున్నారు. కానీ గ్రౌండ్​లోనే ఓ రాకాసి బౌన్సర్ దెబ్బకు కన్నుమూశాడతను.

క్రికెట్​లో అతడే నెక్స్ట్ సూపర్ స్టార్ అని అంతా అనుకున్నారు. కానీ గ్రౌండ్​లోనే ఓ రాకాసి బౌన్సర్ దెబ్బకు కన్నుమూశాడతను.

  • Author singhj Published - 04:17 PM, Mon - 27 November 23
ఫిలిప్ హ్యూస్.. గ్రౌండ్​లోనే చనిపోయిన ఓ క్రికెటర్ కథ!  నేటికి 9 ఏళ్లు!

ఆస్ట్రేలియా.. క్రికెట్​లో డేంజరస్ టీమ్​గా దీన్ని చెబుతుంటారు. జెంటిల్మన్ గేమ్​లో ఫియర్​లెస్ అప్రోచ్​తో విజయాలు సాధిస్తూ వస్తోందీ టీమ్. కంగారూలు ఒత్తిడిని అస్సలు తీసుకోరు. ఏదైనా ప్రెజర్ ఉంటే అపోజిషన్ టీమ్ మీదకు నెట్టేస్తారు. ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి ఐసీసీ టోర్నమెంట్స్​లో ఆ టీమ్​ను ఆపడం అంటే కత్తిమీద సామే. డొమెస్టిక్ లెవల్ నుంచి ఆటగాళ్లలో ఫియర్​లెస్ అప్రోచ్​ను అలవాటు చేస్తుంది క్రికెట్ ఆస్ట్రేలియా. అందుకే ఆ జట్టు నుంచి స్టీవ్ స్మిత్, మెక్​గ్రాత్, మైకేల్ బెవాన్, షేన్ వార్న్, రికీ పాంటింగ్, షేన్ వాట్సన్, మైకేల్ క్లార్క్ లాంటి ఎందరో గొప్ప క్రికెటర్లు వచ్చారు. అలాంటి ఆసీస్ నుంచి మరో సూపర్ స్టార్ వస్తున్నాడని అంతా అనుకున్నారు. అతడు వరల్డ్ క్రికెట్​లో దుమ్మురేపుతాడని భావించారు. కానీ ఆ ప్లేయర్ కెరీర్ మధ్యలోనే కన్నుమూశాడు.

2014, నవంబర్ 27వ తేదీ. జెంటిల్మన్ గేమ్​ హిస్టరీలో ఎంతో విషాదాన్ని నింపిన రోజు. ఏ ప్లేయర్ కూడా ఈ రోజును అంత సులువుగా మర్చిపోలేడు. ప్రతి ఆటగాడితో పాటు క్రికెట్ లవర్స్​ను ఏడిపించిన రోజది. 25 ఏళ్ల టాలెంటెడ్ క్రికెటర్ తలకు బాల్ తగలడంతో ప్రపంచాన్ని వదిలిపెట్టాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. ఫిలిఫ్ హ్యూస్. అతడి మరణం ఆస్ట్రేలియాకే కాదు.. మొత్తం క్రికెట్ ప్రపంచానికీ దిగ్ర్భాంతి కలిగించింది. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్​లో న్యూసౌత్ వేల్స్ స్పీడ్​స్టర్ సీన్ అబాట్ వేసిన రాకాసి బౌన్సర్ దెబ్బకు హ్యూస్ గాయపడ్డాడు. అబాట్ వేసిన బాల్ అతడి తల వెనుక భాగంలో గట్టిగా తగిలింది. బాల్ తాకిన వెంటనే హ్యూస్ గ్రౌండ్​లోనే కుప్పకూలిపోయాడు. ఆ ప్రమాదం జరిగిన రెండ్రోజుల తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు.

నవంబర్ 27వ తేదీన ఫిలిప్ హ్యూస్ కన్నుమూశాడు. న్యూసౌత్ వేల్స్​తో ఆడిన మ్యాచ్​లో సౌత్ ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన హ్యూస్ హాఫ్ సెంచరీతో 63 రన్స్​తో నాటౌట్​గా నిలిచాడు. అయితే సీన్ అబాట్ వేసిన బౌన్సర్​ను హుక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఫెయిలయ్యాడు. బాల్ అతడి బ్యాట్​ను దాటి తల వెనుక మెడ భాగంలో బలంగా తాకింది. హెల్మెట్ ధరించినా బాల్ దానికి, మెడకు మధ్య గ్యాప్​లో తాకింది. దీంతో అతడు స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. అతడ్ని హెలికాప్టర్​లో సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ఆస్పత్రికి తరలించి సర్జరీ చేశారు. కానీ హ్యూస్ కోమాలోకి జారుకున్నాడు. అతడు కోలుకోవాలని ఆస్ట్రేలియా అభిమానులతో పాటు మొత్తం క్రికెట్ ప్రపంచం ప్రార్థనలు చేసింది. కానీ వారి ప్రార్థనలు ఫలించలేదు. హ్యూస్ ఇదే రోజున ప్రాణాలు విడిచాడు.

20 ఏళ్ల వయసులోనే ఆడుతున్న రెండో టెస్టులోనే సెంచరీతో మెరిశాడు ఫిలిప్ హ్యూస్. డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్ లాంటి భీకరమైన పేసర్స్​ను ఎదుర్కొని హ్యూస్ ఒక ఇన్నింగ్స్​లో 115, మరో ఇన్నింగ్ష్​లో 160 రన్స్ చేశాడు. ఆ టెస్టులో ఆసీస్ నెగ్గింది. సౌతాఫ్రికా సిరీస్​లోనే కాదు శ్రీలంక టూర్​లోనూ హ్యూస్ మరో సెంచరీ బాదాడు. లంకపై రెండు వన్డే సెంచరీలు కూడా సాధించాడు. దీంతో అతడే నెక్స్ట్ ఆసీస్ సూపర్ స్టార్ అని అంతా భావించారు. కానీ 25 సంవత్సరాల వయసులో రాకాసి బౌన్సర్ ఈ ప్లేయర్​ను బలిగొంటుందని ఎవరూ ఊహించలేదు. హ్యూస్ మరణం తర్వాత బ్యాటర్లు పెట్టుకునే హెల్మెట్ల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా మరింత పటిష్టమైన చర్యలు చేపట్టింది. హెల్మెట్​ వెనుక భాగంలో వేసుకునే నెక్ గార్డ్​ను కంపల్సరీ చేసింది. బౌన్సర్ల నుంచి రక్షణ కోసం హెల్మెట్​, నెక్స్ గార్డ్ ధరించాల్సిందేననే రూల్ తీసుకొచ్చింది.

ఇదీ చదవండి: చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా.. క్షమాపణలు కోరిన జైస్వాల్‌!