BCCIకి PCB షాకింగ్ క్వశ్చన్.. దానికి ప్రూఫ్ ఉందా అంటూ..!

భారత క్రికెట్ బోర్డును పాకిస్థాన్ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఓ విషయంలో బీసీసీఐని తెగ ఇబ్బంది పెడుతోంది పీసీబీ. సాక్ష్యాలు ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తోంది.

భారత క్రికెట్ బోర్డును పాకిస్థాన్ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఓ విషయంలో బీసీసీఐని తెగ ఇబ్బంది పెడుతోంది పీసీబీ. సాక్ష్యాలు ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తోంది.

భారత క్రికెట్ బోర్డు వరుసగా మంచి పనులు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటోంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిశాక భారత జట్టు తుఫాన్ కారణంగా బార్బడోస్​లోనే ఉండిపోయింది. ఆ టైమ్​లో పరిస్థితులు కాస్త సద్దుమణగగానే స్పెషల్ ఫ్లైట్​లో రోహిత్ సేనను స్వదేశానికి తీసుకొచ్చింది బీసీసీఐ. ఆటగాళ్లతో పాటు వాళ్ల ఫ్యామిలీస్, మీడియా పర్సన్స్​ను కూడా స్పెషల్ ఫ్లైట్​లో భారత్​కు తీసుకొచ్చింది. అలాగే స్వదేశానికి రాగానే ఓపెన్ బస్​లో ఆటగాళ్లతో విక్టరీ పరేడ్ నిర్వహించింది. వాంఖడే స్టేడియంలో ప్రపంచ కప్ హీరోలను సత్కరించింది. భారీ ప్రైజ్​మనీ ఇచ్చి వాళ్ల ప్రతిభను తగినట్లు గుర్తించింది.

క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్​కు రూ.1 కోటి సాయం చేసింది బీసీసీఐ. ఇలా వరుసగా మంచి పనులు చేస్తున్న మన బోర్డును అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇదీ పనితీరంటే.. ఇలా వర్క్ చేయాలంటూ మెచ్చుకుంటున్నారు. అయితే భారత బోర్డును పాకిస్థాన్​ మాత్రం ఇరుకున పెట్టాలని చూస్తోంది. వరల్డ్ రిచెస్ట్ క్రికెట్​​ బోర్డ్​గా పేరు తెచ్చుకున్న బీసీసీఐకి ఐసీసీ మీద మంచి పట్టు ఉంది. మన బోర్డు ఏం చెబితే అక్కడ అదే నడుస్తుందని ఎక్స్​పర్ట్స్ అనడం చూస్తూనే ఉంటాం. అదే ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు గిట్టడం లేదు. అందుకే ప్రూఫ్స్ కావాలంటే బీసీసీఐకి షాకింగ్ క్వశ్చన్స్ వేస్తోంది. అసలు విషయం ఏంటంటే.. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు టీమిండియా తప్ప అన్ని జట్లు ఓకే అన్నాయి. ఈ టోర్నీ కోసం పాక్​కు వచ్చేది లేదంటూ బీసీసీఐ పలుమార్లు తేల్చి చెప్పింది. ఆ దేశంతో భారత్​కు ఉన్న సరిహద్దు గొడవలు, దౌత్యపరమైన సమస్యల వల్ల అక్కడైతే ఆడబోమని.. కావాలంటే తమ మ్యాచుల్ని దుబాయ్ లేదా శ్రీలంకకు షిఫ్ట్ చేయాలని బీసీసీఐ పట్టుబడుతోంది. ఇదే విషయంపై ఐసీసీ మీద ఒత్తిడి తీసుకొస్తోంది. అయితే పాక్ బోర్డు మాత్రం భారత్ కచ్చితంగా తమ దేశానికి రావాల్సిందేనని అంటోంది. అన్ని టీమ్స్ ఓకే అన్నాక.. బీసీసీఐకి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నిస్తోంది. ఒకవేళ పాక్​కు రావొద్దనుకుంటే అదే విషయం మీద భారత ప్రభుత్వం నుంచి అధికారిక లేఖను తీసుకురావాలని.. అలాంటి ప్రూఫ్ ఏమైనా ఉందా? అని క్వశ్చన్ చేస్తోందని తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ ఎలా రియాక్ట్ అవుతోందో చూడాలి.

Show comments