iDreamPost
android-app
ios-app

వీడియా: భారత మాజీ క్రికెటర్‌ ఛాతికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టేశారు! ఎందుకలా చేశారంటే..?

  • Published Jul 15, 2024 | 3:03 PMUpdated Jul 15, 2024 | 3:03 PM

Irfan Pathan, WCL 2024: పాకిస్థాన్‌తో మ్యాచ్‌ కోసం సిద్ధం అవుతూ.. ఓ మాజీ క్రికెటర్‌ తన ఛాతికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టేసుకున్నాడు. అతను అలా ఎందుకు చుట్టుకున్నాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Irfan Pathan, WCL 2024: పాకిస్థాన్‌తో మ్యాచ్‌ కోసం సిద్ధం అవుతూ.. ఓ మాజీ క్రికెటర్‌ తన ఛాతికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టేసుకున్నాడు. అతను అలా ఎందుకు చుట్టుకున్నాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

  • Published Jul 15, 2024 | 3:03 PMUpdated Jul 15, 2024 | 3:03 PM
వీడియా: భారత మాజీ క్రికెటర్‌ ఛాతికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టేశారు! ఎందుకలా చేశారంటే..?

క్రికెట్‌లో ఆటగాళ్లు చాలా రకాల జాగ్రత్తలు తీసుకుని ఆడుతుంటారు. బాల్‌ తాకితే గాయపడకుండా ఎన్నో రకాల సేఫ్టీలు ధరిస్తుంటారు. హెల్మెంట్‌, ప్యాడ్లు, గ్లౌజులే కాకుండా.. థైప్యాడ్‌, గాడ్‌తో పాటు మరి కొన్ని రకాల ప్యాడ్లు కూడా ధరిస్తారు. అయినా కూడా కొన్ని సార్లు గాయపడుతుంటారు. అయితే.. తాజాగా ఓ భారత మాజీ క్రికెటర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌లో విచిత్రమైన జాగ్రత్త తీసుకున్నాడు. ఛాతిని వీపును కవర్‌ చేస్తూ.. చుట్టూ ప్లాస్టిక్‌ కవర్‌తో చుట్టేశారు. ప్లాస్టిక్‌ కవర్‌ అలా చుడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఎందుకు అలా చుడుతున్నారు? దాని వల్లే ఏంటి ఉపయోగం అని క్రికెట్‌ అభిమానులు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. అలా ఎందుకు చుట్టారు? ఏ క్రికెటర్‌కి చుట్టారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు పాల్గొన్న వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ టోర్నీలో యువరాజ్‌ సింగ్‌ కెప్టెన్సీలోని ఇండియా ఛాంపియన్స్‌ జట్టు విజేతగా నిలిచింది. పాకిస్థాన్‌తో ఈ నెల 13న జరిగిన ఫైనల్‌లో గెలిచి కప్పు సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఛాతికి చుట్టూ ప్టాస్టిక్‌ కవర్‌ చుట్టారు. అలా ఎందుకు చుట్టారో ఎవరికి అర్థం కావడం లేదు. అయితే.. కొంతమంది క్రికెట్‌ నిపుణులు మాత్రం.. ఈ విధంగా దానికి కారణాలు వివరించారు.

ఎవరికైనా వయసు పెరిగే కొద్ది.. కండరాలు వదులుగా అయిపోతాయని, భారీ కాయంతో ఉంది కండరాలు వదులుగా అయిపోయిన తర్వాత.. వేగంగా పరిగెత్తడం, దూకడం లాంటివి చేస్తూ.. శరీరంలోని ఛాతి భాగం కిందికి పైకి ఊగి తీవ్ర నొప్పి కలిగే ప్రమాదం ఉంటుంది. క్రికెట్‌ అంటే పరిగెత్తడం తప్పని సరి, బౌలింగ్‌ వేసేటప్పుడు, రన్స్‌ తీయాలన్న, రన్స్‌ ఆపాలన్న పరిగెత్తాల్సిందే. అలా పరిగెత్తే క్రమంలో ఇబ్బంది పడకుండా పఠాన్‌ తన ఛాతి ఊగకుండా అలా ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకున్నట్లు తెలుస్తోంది. మర ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి