SNP
SNP
ఆసియా కప్ 2023 సూపర్ 4 స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిన తర్వాత.. పాకిస్థాన్ క్రికెట్‌లో విభేదాలు బయటపడుతున్నాయి. ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్‌తో జట్టులోని ఇతర స్టార్ క్రికెటర్లకు పడట్లేదని సమాచారం. జట్టు విషయాల్లో బాబర్ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా లేవంటూ చాలా కాలంగా లోలోల వారి మధ్య వాదనలు జరుగుతున్నా.. ఆసియా కప్‌లో సూపర్ 4 స్టేజ్‌లో శ్రీలంకతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో ఓటమి తర్వాత.. విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి.
లంకతో మ్యాచ్ తర్వాత.. టీమ్ మీటింగ్‌లో కెప్టెన్ బాబర్ అజమ్‌కు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీకి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. టీమ్ చాలా చెండాలంగా ఆడిందంటూ కెప్టెన్ బాబర్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. షాహీన్ మాత్రం.. మంచి ప్రదర్శనలు చేసిన వారినైనా కనీసం అభినందించాలంటూ బాబర్‌తో విభేదించాడు. దీంతో వారిద్దరూ కొద్ది సేపు వాదన పెట్టుకున్నారు. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్ మొహమ్మద్ రిజ్వాన్ వారిద్దరినీ సముదాయించినట్లు తెలుస్తుంది.
అయితే.. రిజ్వాన్ సైతం బాబర్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆ జట్టు వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ మాట్లాడుతూ.. బాబర్ అజమ్‌తో గ్రౌండ్‌లో సరిగా ఉండలేకపోతున్నాం.. అతను ఫీల్డ్‌లో చాలా భిన్నంగా ఉంటాడు. కానీ, ఆఫ్ ది ఫీల్డ్ మాత్రం అతనితో బాగానే ఉంటుంది. అతని కంపెనీని ఎంజాయ్ చేస్తామంటూ వెల్లడించాడు. ఇలా బాబర్ ఫీల్డ్‌లో తమతో సరిగ్గా ఉండడంటూ బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు గాను.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీరియస్ అయినట్లు తెలుస్తుంది. షాదాబ్ ఖాన్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు పీసీబీ సిద్ధమైనట్లు సమాచారం. బాబర్‌తో గొడవలు.. షాదాబ్ వైస్ కెప్టెన్సీకి ముప్పు తెచ్చినట్లు అయింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shaheen Afridi might replace Shadab Khan as Babar Azam’s second-in-command 🇵🇰#ODIWorldCup2023 #ShaheenAfridi #Pakistan #CricketTwitter pic.twitter.com/ldyTKhD7h7
— InsideSport (@InsideSportIND) September 19, 2023
ఇదీ చదవండి: సిరాజ్ కు ఒక SUV గిఫ్ట్ గా ఇవ్వండి.. నెటిజన్ కామెంట్ కు ఆనంద్ మహీంద్ర ఎపిక్ రిప్లై