iDreamPost
android-app
ios-app

సిరాజ్ కు ఒక SUV గిఫ్ట్ గా ఇవ్వండి.. నెటిజన్ కామెంట్ కు ఆనంద్ మహీంద్ర ఎపిక్ రిప్లై

  • Author Soma Sekhar Published - 10:01 AM, Tue - 19 September 23
  • Author Soma Sekhar Published - 10:01 AM, Tue - 19 September 23
సిరాజ్ కు ఒక SUV గిఫ్ట్ గా ఇవ్వండి.. నెటిజన్ కామెంట్ కు ఆనంద్ మహీంద్ర ఎపిక్ రిప్లై

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాది స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ చేసిన అద్భుత ప్రదర్శనతో అతడిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి దేశంలో ఎవరి నోట విన్నా సిరాజ్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సిరాజ్ పై ప్రశంసలు కురిపించగా.. తాజాగా ఆనంద్ మహీంద్ర సైతం ప్రశంసల జల్లు కురిపించాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. యువకుల టాలెంట్ ను ప్రశంసించడంలో ఎప్పుడూ ముందుంటారు ఆనంద్ మహీంద్ర. అయితే ఆనంద్ మహీంద్ర, సిరాజ్ ను ప్రశంసించగా.. ఓ నెటిజన్ సిరాజ్ కు ఒక SUVని గిఫ్ట్ గా ఇవ్వండని అడిగాడు. ఈ ప్రశ్నకు ఎపిక్ రిప్లై ఇచ్చాడు ఆనంద్ మహీంద్ర.

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో ఒకే ఓవర్ లో 4 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు టీమిండియా స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక సిరాజ్ అద్భుత ప్రదర్శనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం పొగడ్తల వర్షం కురిపించాడు. సిరాజ్ ను మార్వెల్ అవెంజర్, నువ్వు ప్రత్యర్థులపై అతీంద్రియ శక్తులను విడుదల చేశావు అంటూ.. ఆకాశానికి ఎత్తేశాడు ఆనంద్ మహీంద్ర. ఈ క్రమంలోనే ఆయనకు ఓ నెటిజన్ నుంచి విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ఆయన ట్వీట్ కు ఓ అభిమాని రీ ట్విట్ చేస్తూ.. సార్ ప్లీజ్ సిరాజ్ కు ఒక SUV గిఫ్ట్ గా ఇవ్వండని రిక్వెస్ట్ చేశాడు.

ఈ ట్వీట్ కు ఆనంద్ మహీంద్ర సూపర్ రిప్లై ఇచ్చాడు. సిరాజ్ కు గతంలోనే ఒక SUV గిఫ్ట్ గా ఇచ్చాను అని బదులిచ్చాడు. 2021లో ఆసీస్ తో టెస్ట్ మ్యాచ్ గెలిచిన సందర్భంగా ‘థార్’ ను గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలిపారు. ఇక సిరాజ్ తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫ్రైజ్ మనీ రూ. 4 లక్షలను గ్రౌండ్ స్టాఫ్ కు ఇవ్వడంపై అతడి నిర్ణయం ది క్లాస్ అని చెప్పాడు.”ఇది మీ సంపద నుంచి వచ్చేది కాదు.. మీ దయాగుణం నుంచి వచ్చేది”అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్ర. మరి నెటిజన్ ప్రశ్నకు సూపర్ రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbet